Breaking News

‘యన్.టి.ఆర్’ పోటీగా వినయ విధేయ రాముడు!


 

ఈ న్యూ ఇయర్ కి టాలీవుడ్ లో చిన్న, పెద్ద సినిమాల పోస్టర్స్ మీడియాలో తెగ హడావిడి చేశాయి. 31 నైట్ నుండే తమ తమ సినిమాలతో న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ.. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ పోస్టర్స్ విడుదల చేశారు. అయితే అన్నిటిలో ఎక్కువగా ఈ సంక్రాంతి బరిలో పోటా పోటీగా బరిలోకి  దిగుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాల పోస్టర్సే అందరిని ఆకట్టుకునేలా కనబడ్డాయి. సంక్రాతి బరిలో భారీ క్రేజున్న చిత్రాలుగా మొదటి నుండి న్యూస్ లో ఉంటున్న ఈ రెండు చిత్రాలు న్యూ ఇయర్ పోస్టర్స్ లోను పోటీ పడ్డాయి. 

ప్రమోషన్స్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయితే.. వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్, చిరులు గెస్ట్‌లుగా విచ్చేసారు. ఇక మాస్ మూవీగా బోయపాటి - రామ్ చరణ్‌ల వినయ విధేయ రామకి మొదటి నుండి భారీ అంచనాలుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు బయోపిక్‌గా కథానాయకుడికి క్రేజుంది.

మరి కథానాయకుడితో ఎన్టీఆర్ భార్య బసవతారకం కేరెక్టర్ లో నటిస్తున్న విద్య పుట్టిన రోజు, న్యూ ఇయర్ డే.. ఒకే రోజు కావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ టీం విద్య పుట్టిన రోజు కానుకగా కథానాయకుడు పోస్టర్ విడుదల చేసింది. అలాగే బాలకృష్ణ, విద్యాబాలన్‌ల కాంబో పిక్ అంటే ఫామిలీస్ ఆకట్టుకునేలా మరో పోస్టర్ ని న్యూ ఇయర్ విషెస్ తో విడుదల చేసింది. 

ఇక వినయ విధేయరామ 31న రామ్ చరణ్ అన్న, వదినలతో కలిసున్న ఫ్యామిలీ పిక్ అంటే వినయ విధేయ రామ ఫ్యామిలీ పోస్టర్‌తో పడెయ్యగా... న్యూ ఇయర్ రోజున హీరోయిన్ కియారా తో కలిసి రామ్ చరణ్ ట్రెడిషనల్ లుక్ ని వదిలింది. ఇక వినయ విధేయ రామ న్యూ ఇయర్ పోస్టర్ మాత్రం రొమాంటిక్‌గా అందంగా ఫ్యామిలీస్‌కి ఎక్కేసింది. 

మరి సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఈ రెండు చిత్రాలు ఇలా ప్రమోషన్స్ విషయంలోనూ భారీగానే పోటీ పడుతున్నాయి. మరి న్యూ ఇయర్ పోస్టర్స్‌లో రెండు సినిమాల్లో ఏది హైలెట్ గా నిలిచింది అనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక రెండు సినిమాల అంటే బాలయ్య అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అంటే నందమూరి, మెగా అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోల లుక్స్‌తో సంతృప్తి చెందారు.



By January 03, 2019 at 06:53AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44137/ntr-biopic.html

No comments