Breaking News

‘మహానాయకుడు’తోనైనా సత్తా చూపుతారా?


ఒకే కథను రెండు భాగాలుగా తీయడం కొన్ని సార్లు వరంగా, కొన్నిసార్లు శాపంగా మారుతుంది. ‘బాహుబలి’ విషయంలో ప్రతి సీన్‌ ఎంతో ముఖ్యమైనదిగా రూపొందడంతో వాటిని ఎడిట్‌ చేసి ఒకే పార్ట్‌లో విడుదల చేయడం కన్నా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ఆసక్తికర ట్విస్ట్‌తో రాజమౌళి కాసుల వర్షం కురిపించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’ అనే ఉత్కంఠను మెయిన్‌టెయిన్‌ చేశాడు. ఇక కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం’ విషయంలో కూడా ఇదే ఫాలో అయినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ‘2.ఓ’ విషయంలో శంకర్‌ వంటి వాడే ‘రోబో’ మ్యాజిక్‌ని రిపీట్‌ చేయలేకపోయాడు. కాబట్టి సెకండ్‌పార్ట్‌ అనే దానికి కొన్ని పరిమితులు ఉంటాయనేది ఖచ్చితంగా స్పష్టమవుతోంది. 

ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో బాలయ్య కాస్త అతిగా ఆలోచించాడనే అర్దమవుతోంది. ఎన్టీఆర్‌ సినీ స్టార్‌గా ఉన్నప్పటి జీవితాన్ని మొదటి పార్ట్‌లో చూపించి, ఇంటర్వెల్‌లో పొలిటికల్‌ ఎంట్రీతో ట్విస్ట్‌ ఇచ్చి ‘మహానాయకుడు’ కథను ఇంటర్వెల్‌ తర్వాత చూపి ఉంటే అది రేసీ స్క్రీన్‌ప్లేతో కాస్తైనా ఆకట్టుకుని ఉండేది. కానీ ఎన్టీఆర్‌ జీవితాన్ని విపులంగా చెప్పాలనే తలంపుతో, అందునా వాస్తవాలను విస్మరించి రెండు పార్ట్‌గా చూపించాలనే ఐడియా బెడిసి కొట్టింది. 

ఓ ఐడియా ‘బాహుబలి’కి కనకవర్షం కురిపిస్తే, అలాంటి ఐడియా ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో విఫలమైంది. ఇక ‘కథానాయకుడు’ డిజాస్టర్‌ వల్ల ‘మహానాయకుడు’కి కోలుకోలేని దెబ్బ తగలడం గమనార్హం. బాలయ్య పక్కా మాస్‌ హీరో. ఆయన నుంచి ‘సింహా, లెజెండ్‌’ వంటి పవర్‌ఫుల్‌ చిత్రాలనే ఆయన అభిమానులు కోరుకుంటారు. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా బాలయ్యకి లేదు. కేవలం మాస్‌ ఆడియన్స్‌ మాత్రమే ఆయనకి బలం. ఈ చిన్నలాజిక్‌ని బాలయ్య విస్మరించాడు. ఏదో ఎన్టీఆర్‌ గెటప్స్‌, పాటల బిట్స్‌, రెండు మూడు పవర్‌ఫుల్‌ సీన్స్‌ ఉంటే చాలు ఎన్టీఆర్‌ని దేవుడిగా భావించే తెలుగు ప్రేక్షకులు ఎగబడతారని నమ్మాడు. ‘కథానాయకుడు’ ఫలితంగా రెండో పార్ట్‌పై ప్రేక్షకులకు అసలు ఆసక్తే పోయింది.

అందునా కాస్తైనా మసాలా అంశాలు ‘కథానాయకుడు’లో పెట్టడానికి స్కోప్‌ ఉందే గానీ లక్ష్మీపార్వతి, చంద్రబాబుల ఎపిసోడ్స్‌ లేకుండా సీరియస్‌గా సాగే పొలిటికల్‌ స్టోరీ మాస్‌ని ఎలా ఆకట్టుకుంటుందో అర్ధం కాని విషయం. ఇక ‘కథానాయకుడు’కి ఏకంగా 70కోట్లకు పైగా బిజినెస్‌ జరగడం బయ్యర్ల తప్పిదమే అని చెప్పాలి. బాలయ్య బ్లాక్‌బస్టర్స్‌ కూడా 50 కోట్లకి అటు ఇటుగానే ఉంటాయి. మరి మొదటి పార్ట్‌లో జరిగిన తప్పిదాలను మరలా రీషూట్స్‌ జరుగుతున్నాయని టాక్‌ వస్తున్న వేళ ‘మహానాయకుడు’లోనైనా సరిదిద్దుకుంటారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.



By January 30, 2019 at 06:16AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44484/ntr-mahanayakudu.html

No comments