Breaking News

ఇలాంటివి ఇండస్ట్రీని నాశనం చేయడానికేగా!


చిన్నచిత్రాల నిర్మాతలు అని వేలెత్తి చూపడం తప్పే. ఎందుకంటే నేడు ఎందరో తమ చిన్న చిత్రాలతో పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నారు. కానీ చిన్ననిర్మాతల్లో కూడా రెండు రకాల వారు ఉన్నారు. సినిమాపై ప్యాషన్‌తో, మంచి పట్టుతో సినిమాలు నిర్మించేవారు కొందరైతే, నిర్మాతల పేరుతో మంచి టైటిల్స్‌ని రిజిష్టర్‌ చేయడం, ఆ తర్వాత భారీగా ఇతర నిర్మాతల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే వారు ఇంకొందరు. ఈ కోవలోకి అంతకు ముందు రంగారావు అనే దర్శకనిర్మాతపై ఎన్నో అరోపణలు, విమర్శలు వచ్చాయి. 

ఫేడవుట్‌ అయిన ఆర్టిస్టులను రోజు వారిగా మాట్లాడుకుని వారితో కొన్ని సీన్స్‌ తీసి, వాటిని అమ్మకానికి పెడుతూ ఉంటారు. మరికొందరు అవకాశాల కోసం ఎదురు చూసే నటీనటులు, దర్శకుల చేత డబ్బు, కాస్టింగ్‌కౌచ్‌ వంటివి చేస్తుంటారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కాబట్టి చిన్ననిర్మాతలు అనగానే అందరు సినిమాలపై ఇష్టంతో వస్తారని భావించలేం. ఇండస్ట్రీలో ఉండే లోపాలు, తమ కోరికలు, నిర్మాతలుగా తమ పేరు చూసుకోవడం కోసం సిండికేట్‌ అవుతుంటారు. ఇలాంటి వారు ప్రచారంలోకి వచ్చిన టైటిల్స్‌ని వెంటనే రిజిష్టర్‌ చేసి పారేస్తుంటారు. ఇలాంటి ధోరణి పట్ల గతంలో నాగార్జున నుంచి తమ్మారెడ్డి భరద్వాజ వరకు ఎందరో ఆవేదన వ్యక్తం చేశారు. 

కొంతకాలం కిందట మహేష్‌బాబు ‘ఖలేజా’కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. దాంతో ‘మహేష్‌ ఖలేజా’అని టైటిల్‌ పెట్టారు. కానీ అసలు ‘ఖలేజా’ ఇప్పటికీ వచ్చిందో ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఇక ఇలాంటి నిర్మాతల కోవలోకి వచ్చే వ్యక్తి నట్టికుమార్‌. ఓ వర్గపు చిత్రాల నిర్మాతగా, ఆ తర్వాత జీసస్‌ మీద కూడా చిత్రం తీసిన ఆయన దాసరి అండ చూసుకుని నాడు పెత్తనం చేయాలని చూసేవాడు. కానీ దాసరి తర్వాత ఈయన పప్పులు ఉడకనీయడంలేదు.. అని భావిస్తున్న తరుణంలో ఈయన కళ్లు నిఖిల్‌, ఠాగూర్‌మధుతో పాటు వారు తీస్తున్న ‘ముద్ర’పై పడింది. 

నిఖిల్‌ బొమ్మని చూపి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేయడం, నిఖిల్‌ ‘ముద్ర’ టైటిల్‌ ఫాంట్‌లోనే తన లోగో తయారు చేయడం నిజంగా దారుణం. పైగా రెండు ‘ముద్ర’లకి ఒకే బయ్యర్‌ కావడం వల్లనే ఇలా జరిగిందని వితండవాదం చేస్తున్నాడు నట్టికుమార్‌. ఇకనైనా ఫిల్మ్‌ఛాంబర్‌, నిర్మాతల మండలి ఇలాంటి నిర్మాతల విషయంలో మరింత కఠిన నిబంధనలు తీసుకుని రావాల్సివుంది.



By January 30, 2019 at 06:28AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44485/mudra.html

No comments