విమర్శించినా.. కోపం రాదంటున్న వెంకీ..!!
స్టార్ హీరోలతో చిత్రాలు తీస్తే ఆయా సినిమాలు విజయవంతమైతే క్రెడిట్ అందులోని స్టార్స్ ఖాతాలో పడుతుంది. దీనికి వినాయక్ ‘ఖైదీనెంబర్150’, బాబి ‘జైలవకుశ’లను ఉదాహరణగా చెప్పాలి. కానీ కొందరు దర్శకులు ఫ్లాప్‌లిచ్చినా కూడా వారికి అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. కానీ ఆ అదృష్టాన్ని వారెంతవరకు ఉపయోగించుకుంటారు? అనే దానిపై కెరీర్ ఆధారపడి ఉంటుంది. మెహర్ రమేష్ నుంచి ఎందరో దర్శకులు ఫ్లాప్ చిత్రాలు తీసినా స్టార్ హీరోలు వారికి పలు చిత్రాలలో అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు అదే లక్ వెంకీ అట్లూరికి అవకాశాలు తెచ్చిపెడుతోంది.
తన మొదటి చిత్రాన్ని వరుణ్‌తేజ్‌తో ‘తొలిప్రేమ’గా తీసి మంచి హిట్టు కొట్టాడు. దాంతో వెంటనే అక్కినేని అఖిల్ మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’కి డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి ఓ అనుకున్నంత టాక్ అయితే రాలేదు. అయినా వెంకీ అట్లూరితో సినిమాలు చేయడానికి విజయ్‌దేవరకొండ, నితిన్ వంటి వారు ఆసక్తిని చూపుతుండటం, మైత్రిమూవీమేకర్స్, దిల్‌రాజు వంటి వారి బేనర్లలో అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే వెంకీ నక్క తోకని తొక్కాడనే చెప్పాలి.
ఇక వెంకీ అట్లూరి ‘స్నేహగీతం’ ద్వారా నటుడు అయ్యాడు. ఆ తర్వాత రచయితగా పనిచేశాడు. ఇప్పుడు దర్శకునిగా మారాడు. తనకి త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నంలు స్ఫూర్తిగా చెబుతున్నాడు. మరోవైపు తాను విమర్శలను పట్టించుకోనని, ఈ విషయంలో విమర్శకులపై నాకు కోపం రాదని తెలిపాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘మిస్టర్‌మజ్ను’ చిత్రానికి ఆడియన్స్‌లో మంచి మౌత్ టాక్ వచ్చింది. రివ్యూలలో మాత్రం విమర్శలు వచ్చాయి. కామెడీ బాగా లేదని అన్నారు. కానీ సినిమాలోని కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ‘తొలిప్రేమ’ విషయంలో ఎంతో బాగుందని అన్న విమర్శకులు, ‘మిస్టర్ మజ్ను’ బాగా లేదని విమర్శిస్తున్నారు. అందుకే నాకు విమర్శకులపై కోపం రాదు. వాటిని నేను పాజిటివ్‌గా తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.
By January 30, 2019 at 04:56PM
No comments