Breaking News

పెళ్లిపై విజయ్ దేవరకొండ డెసిషన్ సూపర్!


తెలుగులో ఇటీవల వరకు కొత్త దర్శకులకు ఛాన్స్‌ ఇచ్చే స్టార్స్‌ జాబితాలో రవితేజ, నేచురల్‌స్టార్‌ నాని ముందుండేవారు. వీరు చాలా మంది యంగ్‌ డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇచ్చారు. అలాంటి పలు దర్శకుడు ఇప్పుడు టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెన్సేషనల్‌, రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఈయన ‘పెళ్లిచూపులు’ చిత్రం తరుణ్‌ భాస్కర్‌కి, ‘అర్జున్‌రెడ్డి’, సందీప్‌రెడ్డి వంగాకి మొదటి చిత్రాలు. ఇక ‘ట్యాక్సీవాలా’తో పాటు తాజాగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం ద్వారా భరత్‌ కమ్మ అనే దర్శకునికి అవకాశం ఇచ్చాడు. 

ఇక తాజాగా ఆయనను మీరు కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ముందుంటున్నారు కదా? అని ప్రశ్నిస్తే.. దానికి నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. నేను కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నాననే మాట నిజం కాదు. నిజానికి మంచి టాలెంట్‌ ఉన్న వారే నాకు విజయాలను అందిస్తున్నారు. వారిలో ఉన్న అద్భుతమైన టాలెంట్‌ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇలా టాలెంట్‌ ఉన్న యంగ్‌ టెక్నీషియన్స్‌ నాకు లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని నిజాయితీగా చెప్పుకొచ్చాడు. 

ఇక పెళ్లి గురించి కూడా విజయ్‌ మాట్లాడుతూ... నేను జీవితంలో ఒక సిద్దాంతంతో జీవించాలని భావించాను. ఏ పని మొదలుపెట్టినా డెడ్‌లైన్‌ పెట్టుకుని చేయాలని నిర్ణయించుకున్నాను. డెడ్‌లైన్‌ పెట్టుకుని పని చేస్తే ఫలితం బాగా ఉంటుంది. ఇతరుల కంటే నేను భిన్నంగా చేస్తాననే ఉద్దేశ్యంతోనే హీరోగా ప్రయత్నాలు చేశాను. హీరోగా మారేందుకు నా వయసు 25ఏళ్ల వరకు సాధించేలా డెడ్‌లైన్‌ పెట్టుకున్నాను. అది జరగకపోతే నాకిష్టమైన రచయిత, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లాలని డిసైడ్‌ అయ్యాను. జీవితంలో నేను పెట్టుకున్నలక్ష్యాలను పూర్తి చేయకుంటే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకుంటే చాలా బాధ్యతలు ఉంటాయి. 

కానీ నేను అనుకున్నది సాధించాను కాబట్టి ఇప్పుడు పెళ్లికి రెడీ, హీరోలు కావాలనుకునే యువత కూడా 25ఏళ్లను టార్గెట్‌గా పెట్టుకోండి.. ఆలోపే మనం అనుకున్నది సాధించాలని యూత్‌కి హితబోధ చేశాడు. 



By January 30, 2019 at 03:45PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44495/vijay-deverakonda.html

No comments