Breaking News

‘యాత్ర’ లో కూడా మేటర్ లేనట్లే ఉంది


ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల హోరు మాములుగా లేదు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా విడుదలవడం.. డిజాస్టర్ కావడము జరిగిపోయాయి. ఇక తాజాగా మరో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా. మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమా ఫిబ్రవరి 8 న థియేటర్స్ లోకి దిగబోతుంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ మరో పార్ట్ మహానాయకుడు మాత్రం విడుదల డేట్ పై క్లారిటీ లేదు. ఇక ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న బయోపిక్ లలో ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర సినిమాలే ముందున్నాయి.

అయితే కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ నట జీవితాన్ని దర్శకుడు క్రిష్ ఆవిష్కరించాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు, ఎమోషన్స్ కి చోటు లేకపోవడంతో.. సినిమాకి సెన్సార్ వారు కూడా క్లిన్ సర్టిఫికెట్ ఇచ్చినా.... ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉంటే.. సినిమాలో పస ఉండదని కథానాయకుడు నిరూపించింది. ఇక యాత్ర సినిమా కూడా.. మొత్తం వైఎస్సార్ పాదయాత్ర టోన్ ఉండబోతుందనేది... ఆయన పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిష్టించాడో అనేది చూపించబోతున్నారని యాత్ర ట్రైలర్ లోనే అర్ధమయ్యింది.

మరి ప్రజల మనసులను గెలుచుకుని పాద యాత్ర ద్వారానే... ముఖ్యమంత్రి అయినా రాజశేఖర్ రెడ్డి జీవితంలోను అనేక ఒడిదుడుకుడులు ఉన్నాయి. ఆయన పాద యాత్ర, ముఖ్యమంత్రి, మరణం అన్నీ యాత్రలో చూపించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ నటజీవితంలో ఎలాంటి ట్రెజడీ లేకపోవడంతో.. సినిమా బావున్నా హిట్ కాలేదు. మరి యాత్రలో రాజశేఖర్ రెడ్డి జీవితం కూడా అందరికి తెరిచిన పుస్తకమే అయినా.. కొత్తగా ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ పెద్దగా ప్రేక్షకుల్లో కనబడడం లేదు. అందుకే యాత్ర సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా క్యూరియాసిటీ కలగడం లేదు. మరి ఎన్టీఆర్ కథానాయకుడు వలే యాత్ర కూడా.. ఏమో చూద్దాం ఏమ్ జరుగుతుందో.



By January 31, 2019 at 08:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44507/mammootty.html

No comments