Breaking News

ట్రాక్ తప్పిన బాల‌య్య హీరోయిన్‌!


`ల‌క్సు పాప ల‌క్సు పాప లంచుకొస్తావా...`.. బాల‌కృష్ణ న‌టించిన `న‌ర‌సింహానాయుడు` చిత్రంలోని ఈ పాట ఎంత పాపుల‌ర్ అయిందో అందిరికి తెలిసిందే. ఈ పాట‌లో బాల‌య్య ప‌క్క‌న న‌ర్తించిన ఆషాషైనీ ట్రాక్ త‌ప్పుతోంది. `న‌ర‌సిహానాయుడు` సినిమా త‌రువాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో ల‌క్స్ పాపగా బాగా పాపుల‌ర్ అయిన ఆశాషైని ఆ స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక‌పోయింది. క‌థానాయిక‌గా రాణించాల‌నుకున్న ఆషాషైనీ చివ‌రికి ఐట‌మ్ సాంగ్‌ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఫ్లోరా షైనిగా వున్న త‌న పేరును ఆషాషైనిగా మార్చుకుని ఆ త‌రువాత పేరు మారిస్తే కెరీర్ ఊపందుకుంటుంద‌ని చెప్ప‌డంతో మ‌యూరిగా మార్చుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. 

దీంతో త‌మిళ‌, క‌న్న‌డ‌, పంజాబీ, హిందీ చిత్రాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లుపెట్టింది. 1999 నుంచి సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన ఆషాషైనీ తెల‌గు, త‌మిళ‌, క‌న్న‌డ, పంజాబీ, హిందీ భాష‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 60కి పైగా సినిమాలు చేసింది. గ‌త కొంత కాలంగా స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఇక లాభంలేద‌నుకుని వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేసింది. ఆ మ‌ధ్య రామ్‌గోపాల్‌వ‌ర్మ తొలిసారి రూపొందించిన వెబ్ సిరీస్‌లో వ‌ల్గ‌ర్ పాత్ర‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఈ ఛండీఘ‌డ్ చిన్న‌ది ఇప్పుడు పూర్తిగా ట్రాక్ త‌ప్పిపోయింది. 

ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ `గందీబాత్‌`(గ‌లీజ్ మాట‌లు) సీజ‌న్‌-2. ఇందులో ఆషాషైనీ హ‌ద్దులు దాటి న‌టించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన తాజా ట్రైల‌ర్ నెట్టింట్లో దుమ్మురేపుతోంది. ప‌క్కా అడ‌ల్ట్ కంటెంట్‌తో నింపేసిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అందుబాటులోకి రానుంది.  భార‌తీయ వెబ్ సిరీస్‌ల‌లో హ‌ద్దులు దాటిన కంటెంట్‌తో రానున్న వెబ్ సిరీస్ ఇదే కావ‌డంతో దీనికి భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ట్రైల‌రే 2 మిలియ‌న్ వ్యూస్‌ని దాట‌డాన్ని బ‌ట్టి దీని డిమాండ్ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవ‌చ్చు. 



By January 03, 2019 at 02:36PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44141/asha-saini.html

No comments