Breaking News

రవితేజ, సాయిధరమ్ ఎందుకు ఫీలయ్యారు?


డైరెక్టర్ హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఆ మధ్య ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ తో ఓ మల్టీస్టారర్ ను రూపొందించాలని చూసాడు కానీ ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో అది సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది..

అయితే రూట్ మార్చి తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలనీ చూస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈసినిమా తెరకెక్కనుంది. సిద్ధార్థ్ పాత్ర కోసం సాయిధరమ్ తేజ్‌ను..నెగెటివ్ షేడ్స్ తో కూడిన బాబీ సింహా పాత్ర కోసం రవితేజను తీసుకుందాం అని వారిని సంప్రదిస్తే వెంటనే ఓకే చేసారట. 

అయితే మరి హరీష్ శంకర్ ఏమి అనుకున్నాడో ఏమో కానీ వీరి కాదని వరుణ్ తేజ్ అండ్ నాగ శౌర్య లని ఓకే చేసి వారితో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట. అయితే తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా హరీష్ శంకర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో.. సాయి ధరమ్ తేజ్ అండ్ రవితేజ ఫీల్ అయినట్టు ఫిలింనగర్ సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.



By January 02, 2019 at 12:22PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44128/raviteja.html

No comments