Breaking News

నిర్మాతపై సీరియస్ అయిన అక్కినేని హీరో!


‘మళ్ళీ రావా’ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న సుమంత్ కి ఈ ఏడాది వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. ‘సుబ్రమణ్యపురం’ తో మొదటి డిజాస్టర్ అందుకుంటే ‘ఇదం జగత్’ తో రెండో డిజాస్టర్‌ని అందుకున్నాడు. అయితే “సుబ్రమణ్యపురం” సినిమాకి కాస్త ఓపెనింగ్స్ అన్నా వచ్చాయి కానీ ‘ఇదం జగత్’ అనే సినిమా జనాలకి అసలు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదు అంటే దీని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్స్ దీన్ని హడావుడిగా.. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయడంతో ఘోరమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో ఈసినిమా సుమంత్‌కి డిజాస్టర్ ని తెచ్చిపెట్టింది. టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే.. అసలు ఈ సినిమా తన కెరీర్‌లోనే చాలా తక్కువ కలెక్షన్స్ వసూల్ చేసిందని అంటున్నాడు సుమంత్.

లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూ లో ఈవిషయం గురించి చెప్పాడు సుమంత్. అసలు ఇంత దారుణంగా సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు? కనీసం ప్రమోషన్స్ లేకుండా సినిమాను ఎందుకు వదిలినట్టు నాకు అర్ధం కావట్లేదు. సినిమా తీయడం ఇష్టం లేకపోతే సైలెంట్ గా కూర్చోవాలి కానీ డబ్బులు పోసి సినిమాని తీసి పబ్లిసిటీ చేయకుండా ఎలా రిలీజ్ చేస్తారు అని ప్రొడ్యూసర్‌ని ఏకిపారేశాడు. ఈ విషయాలు అన్ని ఓ లేఖ రూపంలో రాసి ప్రొడ్యూసర్ కి పంపాడట సుమంత్. అసలే సినిమాలకి తీవ్రమైన పోటీ ఉంటే.. ఎటువంటి ప్రమోషన్ లేకుండా సినిమాని ఎలా విడుదల చేశారో.. ఆ నిర్మాతలకే తెలియాలి మరి.



By January 02, 2019 at 12:29PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44129/sumanth.html

No comments