Breaking News

సిద్ధార్థను రిజెక్ట్ చేసిన కమల్ హాసన్


హీరోగా అవకాశాల్లేక, రాక తన సినిమాలు తానే ప్రొడ్యూస్ చేసుకొనే స్థాయికి వచ్చేసిన సిద్ధార్ధ్ సడన్ గా శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు అని తెలిసేసరికి అప్పటివరకూ అజ్ణాతవాసంలో ఉన్న అతడి అభిమానులందరూ సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు. కానీ.. ఆ ఆనందం ఎంతసేపో నిలవలేదు. మరి కమల్ హాసన్ కి నచ్చలేదో.. లేక శంకర్ మళ్ళీ ఆలోచించి వద్దనుకున్నాడో తెలియదు కానీ.. అత్యంత ప్రతిష్టాత్మక సీక్వెల్ అయిన ఇండియన్ 2 నుంచి సిద్ధార్డ్ ను తప్పించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సిద్ధార్థ్ స్థానంలో ఆర్యను సెలక్ట్ చేశారని వినికిడి. 

అయితే.. కొన్ని వర్గాల సమాచారం మేరకు, నిజానికి శంకర్ కి సినిమాలోని కమల్ హాసన్ కుమారుడి పాత్రకు సిద్ధార్థ్ అయితేనే న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నప్పటికీ.. సిద్ధార్థకు ఇదివరకు కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ తో ఉన్న రిలేషన్ షిప్ కారణంగా కమల్ అతడ్ని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. మరి ఈ రిజెక్షన్ ను సిద్ధార్థ్ తట్టుకొని నిలబడతాడో లేదో చూడాలి. 

ఇకపోతే.. ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిద్ధార్థ్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధాధున్ రీమేక్ రైట్స్ కొనుక్కొని.. ఆ సినిమాని తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేసేపనిలో పడ్డాడు. మరి ఈ సక్సెస్ ఫుల్ రీమేక్ తోనైనా సిద్ధార్థ్ మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ అవుతాడో లేదో చూడాలి.



By February 01, 2019 at 01:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44517/siddharth.html

No comments