Breaking News

వార్నీ.. ఆ హీరోయిన్ని అసలు అడగలేదట


మహర్షి అనంతరం మహేష్ బాబు హిట్ అవ్వకపోయినా తనకు ఒన్ నేనొక్కడినే లాంటి యూనీక్ ఫిలిమ్ ను ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకొన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. ప్రీప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సుకుమార్ హర హర మహదేవ్ అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేయించి ఉండడం, ఈ సినిమా ఎర్ర చందనం నేపధ్యంలో తెరకెక్కనుందని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందడంతో మరో రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి సుకుమార్ రెడీ అవుతున్నాడనుకున్నారు అందరూ. 

పనిలో పనిగా ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ ను ఫైనల్ చేశారని కూడా గుసగుసలు వినిపించాయి. ఆల్రెడీ తెలుగులో వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలయ్యతో అల్లరి పిడుగు చిత్రాల్లో నటించి ఉన్న కత్రినా అయితే మహేష్ బాబు సరసన పర్ఫెక్ట్ అనుకున్నారు మహేష్ ఫ్యాన్స్ అందరూ. కానీ.. నిన్న ముంబైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఈ విషయమై స్పందించిన కత్రినా బాంబు పేల్చింది. 

అసలు నన్ను ఇప్పటివరకూ మహేష్ బాబు సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదు. అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. అయినా నాకున్న కమిట్ మెంట్స్ కి ఇప్పట్లో తెలుగులో సినిమా సైన్ చేసే ఖాళీ కూడా లేదు అని తేల్చి చెప్పేసింది, మరి ఈ ఫేక్ న్యూస్ ను సుకుమార్ టీం ఇప్పటివరకూ ఎందుకు ఖండించలేదో అర్ధం కావడం లేదు జనాలకి.



By February 01, 2019 at 12:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44516/katrina-kaif.html

No comments