Breaking News

ఆ స్టోరీకి రాజ్ తరుణ్‌ని సెలక్ట్ చేయడమేంటో?


ఇచ్చిన మాట మీద నిలబడి దెబ్బలు తినడం కంటే ఇచ్చిన మాట తప్పి విజయం సాధించడం ఎలానో అల్లుఅరవింద్‌ తర్వాత దిల్‌రాజుని చూసి నేర్చుకోవాలి. గత కొంతకాలంగా కొన్ని చిత్రాలు బాగా ఆర్ధిక నష్టాలను కలిగించడంతో దిల్‌రాజు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచిన ‘ఎఫ్‌ 2’ చిత్రంతో రూపాయికి పది రూపాయల ఆదాయం సాధిస్తున్నాడు. ఈమధ్య బిగ్‌స్టార్స్‌తో ఆయన చిత్రాలు తగ్గించాడు. బహుశా ఇది ‘దువ్వాడ జగన్నాథం’(డిజె) దెబ్బవల్లనే అనిపిస్తోంది. 

మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘మహర్షి’కి కూడా ఆయన సోలో ప్రొడ్యూసర్‌ కాదు. అశ్వనీదత్‌, పివిపిలతో కలిసి భాగస్వామ్యంలో దీనిని నిర్మిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్‌గా శర్వానంద్‌, సమంతలతో ‘96’ని రీమేక్‌ చేస్తున్నాడు. 

కాగా ఆయన మహేష్‌బాబు మేనల్లుడు, మహేష్‌ బావ, ఎంపీ గల్లాజయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ని తెరంగేట్రం చేసే బాధ్యతలను తీసుకుని ‘వీడు మగాడ్రా బుజ్జీ’ ఫేమ్‌ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించాడు కూడా. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. గల్లా అశోక్‌ తెరంగేట్రం చేయడం కోసం అనుకున్న కథ స్క్రిప్ట్‌ నచ్చలేదని, నేటి జనరేషన్‌కి ఇది కనెక్ట్‌ అయ్యే కథ కాకపోవడంతో అదే విషయం మహేష్‌కి చెప్పి ఒప్పించాడనేది ఆ వార్తల సారాంశం. నిజానికి అనుకున్నట్లు స్క్రిప్ట్‌ రాకపోతే, అసంతృప్తితో ఉంటే కథ, దర్శకులను పక్కన పెట్టేయాలి. 

కానీ ఇదే కథతో దిల్‌రాజు అదే కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజ్‌తరుణ్‌ హీరోగా ముందుకు వెళ్తున్నాడు. గతంలో దిల్‌రాజు ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులు రాణించారు. కానీ నాగచైతన్య వంటి హీరోని లాంచ్‌ చేసిన ‘జోష్‌’ చిత్రం దెబ్బతీసింది. మరి దిల్‌రాజు మహేష్‌కి, ఆయన మేనల్లుడికి హ్యాండ్‌ ఇవ్వడానికి కారణం కేవలం స్క్రిప్ట్‌ బాగా రాకపోవడమేనా? మరేదైనా కారణం ఉందా..! అనే విషయంలో ఆసక్తికర చర్చసాగుతోంది. 



By January 31, 2019 at 12:59PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44512/raj-tarun.html

No comments