Breaking News

ఏయ్.. తేజ మళ్లీ ఏశాడుగా..?


కొందరి మాటల్లో చూపించినది చేతల్లో చూపించలేరు. కానీ కొద్దిమంది మాత్రం మాటల్లో కాక చేతల్లో తమ సత్తా చూపుతారు. మాటల్లో గాక చేతల్లో చూపించే దర్శకులలో రాజమౌళి వంటి వారు ఉంటారు. కేవలం మాటలకే పరిమితం అయ్యే దర్శకుల్లో తల బిరుసు తేజ ఒకరు. మొదట్లో లోబడ్జెట్‌లో వినూత్న ప్రేమకథలు తీసి, లోబడ్జెట్‌లో కూడా చిత్రాలను విజయం చేయవచ్చని నిరూపించాడు. చిన్న బడ్జెట్‌ చిత్రాలకు ఒక విధంగా నాడు బాట వేసింది ఆయనే. కానీ ఆ తర్వాత పుష్కరకాలం దండయాత్రలే చేసినా విజయం దక్కలేదు. 

అలా ఫేడవుట్‌ అయిన సమయంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవలే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌లకు కథ చెప్పాను. వారు ఎంతో ఇంప్రెస్‌ అయ్యారు. వారితో చిత్రాలు ఉంటాయని ప్రకటించాడు. ఎట్టకేలకు రానా-సురేష్‌బాబు-కాజల్‌ల పుణ్యమా అని ‘నేనే రాజు నేనే మంత్రి’తో గాడిలోకి వచ్చాడు. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌-కాజల్‌ జంటగా ‘సీత’ చిత్రాన్ని తీస్తున్నాడు. వెంకటేష్‌, బాలయ్యలతో చిత్రాలు ఉంటాయని చెప్పినా వీలుకాలేదు. 

ఇక విషయానికి వస్తే నిజంగా తెలుగు వాడే అయినా తమిళంలో మాస్‌ హీరోగా తన సత్తా చాటుతున్న హీరో విశాల్‌. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షునిగా కూడా తనదైన శైలిలో ముందుకు పోతున్నాడు. ఈయన తమిళంలో నటించే చిత్రాలన్నీ తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. అలా ఈయనకు తెలుగులో మాస్‌ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కానీ ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ‘అభిమన్యుడు, పందెంకోడి 2’ లు కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యాయి. విశాల్‌ ఎంతో కాలంగా మంచి దర్శకుడు, కథ వస్తే తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేస్తానని చెప్పాడు. 

ఇక ‘సీత’ షూటింగ్‌లో ఉన్న తేజ విశాల్‌కి లైన్‌ చెప్పడం, అది విశాల్‌కి బాగా నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు కూడా కమల్‌, రజనీ, వెంకటేష్‌.. ఇలా గాలి వార్తలేనా? లేక నిజం అవుతుందా? అనేవి వేచిచూడాల్సివుంది...! 



By January 31, 2019 at 01:07PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44513/director-teja.html

No comments