Breaking News

సూపర్‌స్టార్.. యంగ్‌ డైరెక్టర్స్‌ని నమ్మాలంటే


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం అంటే తమిళతంబీలకే కాదు.. తెలుగువారికి, ఇతర ప్రాంతీయ భాషల వారికేకాదు.. బాలీవుడ్‌ వారికి కూడా ఎంతో ఆసక్తి. ఇక గతంలో రజనీ ఎక్కువగా పి.వాసు, కె.యస్‌.రవికుమార్‌, సురేష్‌కృష్ణ వంటి దర్శకులతో పనిచేసేవాడు. వారు కూడా రజనీ ఇమేజ్‌, క్రేజ్‌కి తగ్గ రీతిలో రజనీ స్టైల్‌ని మిస్‌ కాకుండా చిత్రాలు తీసేవారు. దాంతో అవి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మణిరత్నంతో ఆయన ‘దళపతి’, శంకర్‌ దర్శకత్వంలో ‘శివాజీ, రోబో, 2.ఓ’ వంటి చిత్రాలు చేశాడు. కానీ దాదాపు వీరందరూ ఒకేసారి ఫేడవుట్‌ అయిపోవడంతో రజనీకి సరైన దర్శకుల కొరత ఏర్పడింది. ఆయన ఇమేజ్‌కి తగ్గట్లు చిత్రాలు తీయడంలో నవతరం దర్శకులు విఫలమవుతున్నారని, ‘కబాలి, కాలా’ చిత్రాలను చూస్తే అర్దమవుతుంది. 

పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘కథానాయకుడు’, కె.యస్‌.రవికుమార్‌తో వచ్చిన ‘లింగా’, సురేష్‌కృష్ణతో ‘బాబా’ చిత్రాలు ఘోరపరాజయం పాలయ్యాయి. ఇక ‘2.ఓ’పై భారీ అంచనాలు ఉన్న కూడా మూడో వారం కల్లా కలెక్షన్లు లేక థియేటర్లు ఖాళీ అయ్యాయి. అయినా తమిళంలో కంటే తెలుగులోనే బెటర్‌ అనిపించింది. ఎమోషన్స్‌కి చోటివ్వకుండా కేవలం గ్రాఫిక్స్‌ మాయాజాలం నమ్ముకుంటే పరిస్థితి ఇంతేనని మరోసారి తేలింది. తెలుగు వెర్షన్‌కి ఏకంగా 20కోట్ల నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. 

ఇక తాజాగా ఆయన నటించిన ‘పెట్టా’ విషయమే తీసుకుంటే దీనిపై మరీ ప్రత్యేకంగా అంచనాలు లేవు. ఈ చిత్రంతో పాటు అజిత్‌ ‘విశ్వాసం’ కూడా అదే రోజున విడుదల కానుంది. దాంతో రజనీకి అడిగినన్ని థియేటర్లు వచ్చే చాన్స్‌లు లేవు. దాంతో ఓపెనింగ్స్‌లో భారీ కోత పడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ‘కబాలి, కాలా’ తీసిన రంజిత్‌పా కంటే మరో యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌సుబ్బరాజ్‌ ఎలా తీశాడో? అనే ఆసక్తి రేగుతోంది. ఇక తెలుగులో రజనీకి బాలయ్య, రామ్‌చరణ్‌, వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ వంటి వారు భారీ పోటీగా వస్తున్నారు. 

మరి ఈ పరిస్థితుల్లో రజనీ మ్యాజిక్‌ చేయాలంటే గతంలో కంటే ఇంకా ఎంతో కష్టపడాల్సివుంటుందని మాత్రం చెప్పవచ్చు. ‘పిజ్జా, జిగర్‌తాండా’ చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్‌సుబ్బరాజ్‌, సన్‌పిక్చర్స్‌ వంటి సెంటిమెంట్స్‌తో పాటు ‘బాషా’ తర్వాత రజనీ చిత్రం సంక్రాంతి రేసులో నిలబడటం మాత్రం ప్లస్సేనని చెప్పాలి. ఇది కూడా దెబ్బతింటే రజనీ మురుగదాస్‌ చిత్రంపైనే అందరి చూపులు ఉండటం ఖాయమని చెప్పవచ్చు. 



By January 04, 2019 at 07:14AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44151/rajinikanth.html

No comments