హీరోగా.. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు!
ఇతర భాషల్లో ఏమో చెప్పలేం గానీ తెలుగులో మాత్రం హీరోలుగా మారిన దర్శకులు, సంగీత దర్శకులు అరుదనే చెప్పాలి. తమిళంలో ఈ తరంలో విజయ్‌ఆంటోని, జివిప్రకాష్‌లతో పాటు గతంలో మణివణ్ణన్‌తో పాటు పలువురు నటులుగా తెర వెనుకే కాదు... తెర మీద కూడా మెప్పించారు. ఇక తెలుగులో కె.విశ్వనాథ్, జంధ్యాల, కాశీవిశ్వనాథ్ వంటి వారు పోసాని నుంచి మరెందరో రచయితలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లుగా రాణించారు.
ఇక డైరెక్టర్ కావాలని వచ్చి హీరోలుగా మారిన వారిలో రవితేజ, నాని, రాజ్‌తరుణ్ వారు ఉన్నారు. కానీ దర్శకులు, సంగీత దర్శకులు హీరోలుగా రాణించింది మాత్రం చాలా అరుదనే చెప్పాలి. కొంతకాలం కిందట తెలుగు సంగీత దర్శకుల్లో డ్రస్ నుంచి హెయిర్‌స్టైల్ వరకు హీరోలకు సరిసమానంగా మెయిన్‌టెయిన్ చేసే సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ హీరోగా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. దీనికి దిల్‌రాజు నిర్మాత కాగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని అన్నారు. దానిపై ఇప్పటివరకు సరైన ఫీడ్‌బ్యాక్ లేదు.
హీరోగా వద్దని దేవిశ్రీ భావించాడా? రెండు పడవల ప్రయాణం వద్దనుకున్నాడా? లేక దిల్‌రాజు, సుకుమార్‌లు వెనక్కి తగ్గారా? అనేవి ఆసక్తిని కలిగిస్తున్నాయి. కాగా త్వరలో ఓ తెలుగు దర్శకుడు హీరోగా మారనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు.. ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హ్యాట్రిక్ కొట్టి ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లోనే విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌లు హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’కి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి.
ఎఫ్2తో ఆయన నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహిస్తే అందులో మూడు దిల్‌రాజు నిర్మించినవే కావడం విశేషం. మరి ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించే అనిల్ రావిపూడి చిత్రాన్ని కూడా దేవిశ్రీ లాగానే దిల్‌రాజు నిర్మిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ అయినా పట్టాలెక్కుతుందా? ‘రాజా ది గ్రేట్’తో పాటు ‘ఎఫ్2’లో కామియో పాత్రలు చేసిన అనిల్ రావిపూడి నిజంగానే హీరోగా మారుతాడా? అనేవి వేచిచూడాల్సివుంది...!
By January 04, 2019 at 09:28AM
No comments