Breaking News

న్యూ ఇయర్ ట్రీట్: చరణ్ మీదెక్కిన కియారా!


సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల సందడితో పాటుగా, భారీగా తెరకెక్కుతూ.. 2019లో విడుదలవుతున్న సినిమాల సందడి కూడా ఈ న్యూ ఇయర్ రోజున మాములుగా లేదు. తమ తమ సినిమాల లుక్స్‌తో ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. చిన్న, పెద్ద సినిమాలు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ 2019 కి స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో ఉన్న వినయ విధేయ రామ అయితే నిన్న అంటే 31న ఫ్యామిలీ పిక్ తో మెగా ఫాన్స్ తో పాటుగా ఫ్యామిలీ ప్రేక్షకులను అందరిని మైమరపించారు. 

బోయపాటి దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ.. ఈ న్యూ ఇయర్‌కి వదిలిన ఫ్యామిలీ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇంకా ఆ ఆనందంలోనే ఉన్న మెగా ఫాన్స్ కి మళ్ళీ జనవరి 1 న వినయ విధేయ రామ టీం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్‌ప్రైజ్ చూసిన మెగా ఫ్యాన్స్ న్యూ ఇయర్‌ని మరింత ఘాటుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సంక్రాంతికి విడుదల కాబోతున్న వినయ విధేయ రామ సినిమా మీద భారీ క్రేజ్‌తో పాటుగా భారీగా అంచనాలున్నాయి. అయితే ఇప్పటివరకు వినయ విధేయ రామ సినిమా మాస్ మాస్ అంటూ అంటూ అందరూ కామెంట్ చేస్తుంటే... మెగా ఫ్యాన్స్‌కి టెన్షన్ పట్టుకుంది. అయితే తాజాగా న్యూ ఇయర్‌కి సందడి చేసున్న ఈ పోస్టర్స్ చూస్తుంటే మాత్రం వినయ విధేయ రామలో ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ సందడి మాములుగా ఉండదనిపిస్తుంది. 

ఇక న్యూ ఇయర్ కానుకగా రామ్ చరణ్ అండ్ కియారా ఇచ్చిన ఫోజు ఉంది చూసారు అదుర్స్ అన్నట్టుగా ఉంది. జనవరి ఫస్ట్ కి వదిలిన ఈ వినయ విధేయ రామ పోస్టర్ లో రామ్ చరణ్ ట్రెడిషనల్ డ్రెస్సులో తన చేతుల మీదుగా ట్రెడిషనల్ లుక్ అంటే లంగా ఓణిలో మెరిసిపోతున్న కియారా అద్వానీని అలా వయ్యారంగా ఎత్తుకున్న ఆ పోస్టర్ మాత్రం ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. 

కైరా అద్వానీ, రామ్ చరణ్ లు ఇచ్చిన ఆ ఫోజు మాత్రం అదిరిపోయింది. ఇక చెర్రీ, కియారాల వెనకాల రామ్ చరణ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ చూసిన దగ్గర నుండి చరణ్ మీదెక్కిన కియారా అంటూ పండగ చేసుకుంటున్నారు.



By January 02, 2019 at 06:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44119/ram-charan.html

No comments