Breaking News

హీరోగా తను ఫెయిల్‌ కాడు: వినాయక్


నా జర్నీలో సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు - పుట్టినరోజు సెల‌బ్రేష‌న్స్‌లో యంగ్‌ డైనమిక్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 

‘అల్లుడు శీను’ చిత్రంతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టి సూపర్‌హిట్‌ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. భీమనేని శ్రీనివాస్‌ రావు దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు మెప్పించారు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘జయజానకినాయక’ చిత్రంతో మాస్‌ ఆడియెన్స్‌ను అలరించడమే కాకుండా శ్రీవాస్‌ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కవచం’లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించారు సాయిశ్రీనివాస్‌. టాలీవుడ్‌ దర్శకులు, నిర్మాతలకు మోస్ట్‌ వాంటెడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ పుట్టినరోజు నేడు(జనవరి 3). ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో కేక్‌ కటింగ్‌తో సాయిశ్రీనివాస్‌ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, లెటెస్ట్‌ క్రేజీ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అభిషేక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ నామ, బెక్కెం వేణుగోపాల్‌, అనీల్‌ సుంకర, మల్టీ డైమన్షన్‌ వాసు, మహేంద్ర, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ.. ‘‘సాయికి హ్యాపీ బర్త్‌డే. తనతో ‘అల్లుడు శీను’ చేస్తున్న సమయంలో కొత్త హీరోతో చేసిన ఫీలింగ్‌ ఎప్పుడూ కలగలేదు. ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ హీరోలా అనిపించాడు. అలాగే బోయపాటితో చేసిన సినిమాలో స్టార్‌ అయ్యాడు. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాకు ఎదుగుతున్నాడు. ‘అల్లుడు శీను’ సినిమాను, పాటలను నేను మరచిపోలేను. ఎందుకంటే ఆ సినిమాను అంత గ్రాండియర్‌గా చేశాం. తను ఇంకా పెద్ద స్టార్‌గా ఎదగాలి. ఎవరికైనా ఒకట్రెండు ఫెయిల్యూర్స్‌ కామన్‌. హీరోగా తను ఎప్పుడూ ఫెయిల్‌ కాడు.. అవ్వడు కూడా. తనకు ఆల్‌ ది బెస్ట్’’ అన్నారు. 

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘సాయి మా ఫ్యామిలీ మెంబర్‌. సినిమా, సినిమాకు తను డాన్స్‌, ఫైట్స్‌ పరంగానే కాదు.. నటన పరంగా ఎదుగుతూ వస్తున్నాడు. మంచి మంచి స్టోరీస్‌ను ఎంచుకుని సినిమాలు చేసి తను మరింతగా ఎదగాలి. ఆల్‌ ది బెస్ట్‌ టు సాయి’’ అన్నారు. 

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అనీల్‌ సుంకర మాట్లాడుతూ.. ‘‘డ్యాన్స్‌లు, ఫైట్స్‌ల్లో మెప్పించిన సాయి మా బ్యానర్‌లో అద్భుతమైన కథాంశం ఉన్న సినిమాను చేస్తున్నారు. రాముడిలాంటి క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. సాయికి వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. 

క్రేజీ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు స్టార్స్‌ ఉన్నా కూడా ఇండస్ట్రీకి స్టార్స్‌ అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది ఆ స్టార్స్‌ లిస్టులో సాయి కూడా జాయిన్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

యంగ్ అండ్‌ డైనమిక్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘హీరోగా నన్ను లాంచ్‌ చేసిన వినాయక్‌గారికి థాంక్స్‌. అలాగే నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలను నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. నా జర్నీలో సపోర్ట్‌ చేస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు.



By January 04, 2019 at 08:35AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44152/bellamkonda-sai-srinivas.html

No comments