Breaking News

‘సాహో’ అయినా లైన్లో ఉంటుందా..?


టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి చూపు మూడు నాలుగు చిత్రాలపైనే ఉంది. ‘బాహుబలి-ది బిగినింగ్‌, బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ తర్వాత యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌, సుజీత్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘సాహో’, మహేష్‌బాబు-వంశీపైడిపల్లిల కాంబినేషన్‌లో మహేష్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రూపొందుతున్న ‘మహర్షి’, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సై..రా...నరసింహారెడ్డి’, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు నటిస్తున్న అసలు సిసలు మల్టీస్టారర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాలపైనే అందరి దృష్టి ఉంది. 

ఇక ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా తన చిత్రాల విడుదల మధ్య రెండేళ్లు గ్యాప్‌ తగ్గించుకోలేకపోతున్న ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ని ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఈమధ్య భారీ చిత్రాలన్ని అనుకున్న తేదీ కంటే ఆలస్యం అవుతున్నాయి. సినిమా ప్రారంభంలోనే మహేష్‌ ‘మహర్షి’ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని ప్రకటించడం, అభిమానులు 100రోజుల ముందే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేయడం తెలిసిందే. కానీ ఇప్పుడు ‘మహర్షి’ ఆ తేదీన వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ధీటుగా భారీ బడ్జెట్‌తో బహుభాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం నిర్మాతలు భారీగా ఖర్చుపెడుతున్నారు. ఇప్పుడు తాజా వార్తల ప్రకారం ఇందులోని ఓ స్పెషల్‌సాంగ్‌ కోసం లిమిట్‌ లేకుండా ఖర్చు చేయాలని నిర్ణయించారట. ‘బాహుబలి’లో ఐటం సాంగ్‌లానే ఇందులో కూడా లారెంట్‌ నికోలస్‌, లారీ నికోలస్‌ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవల డ్యాన్సర్లపై దీనిని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. 

ఇక ఇందులో వందలాది మంది బ్రెజిల్‌ డ్యాన్సర్లను కూడా తీసుకుంటున్నారట. ఈ పాట అనంతరం చిత్రంలోని ఓ ముఖ్యమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ వచ్చే నేపధ్యంలో ఈ సాంగ్‌ ఉంటుందని సమాచారం. ‘బాహుబలి’ని పోలిన విధంగానే ఇందులోని పాటను కూడా డిజైన్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌తో పాటు పలువురు భాషా స్టార్స్‌ నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను కూడా షూటింగ్‌తో సమాంతరంగా చేస్తున్నారు. విడుదలకు కేవలం ఆరేడు నెలలే ఉన్న నేపధ్యంలో ఈ చిత్రాన్నైనా ప్రభాస్‌ అండ్‌ టీం అనుకున్న సమయానికి విడుదల చేస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 



By January 20, 2019 at 06:10PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44352/saaho.html

No comments