Breaking News

నాని రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదంట!


నానికి కెరీర్ పరంగా మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఈమధ్య ఎందుకనో అతని సినిమాలు ఆడడంలేదు. అయితే రీసెంట్‌గా హీరో నాని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.

తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నాని రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదట. అవును నిజమే. రెమ్యూనరేషన్ కి బదులు స్టార్ హీరోస్ లాగా ఏదో ఒక ఏరియా రైట్స్ తీసుకోవాలని నాని నిర్ణయించుకున్నాడట. ఈ డీల్ సినిమాకి ముందే జరిగిందని తెలుస్తుంది. నిజానికి సితార ఎంటర్ టైన్‌మెంట్స్ అండ్ హారిక-హాసిని బ్యానర్స్ ఒక్కటే. ప్రొడ్యూసర్స్ వేరు కావొచ్చుకాని రెండు బ్యానర్స్ వ్యవహారాలు రాధాకృష్ణే చూసుకుంటున్నారు.

రాధా కృష్ణ.. హీరోస్ కి ఏరియా రైట్స్ ఇవ్వడానికి ఇష్టపడడు. అంత అవసరం అయితే ఆ హీరోకి కోటి రూపాయలు ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతాడు కానీ బిజినెస్ పార్టనర్ గా మాత్రం ఎవరిని తీసుకోడు. కానీ వినిపిస్తున్న పుకార్ల ప్రకారం.. నాని కూడా ఇందులో వాటాదారు అనే వాదన వినిపిస్తోంది. చిన్న హీరోస్ సినిమాలకి ఏరియా వైజ్ వచ్చే డబ్బు చాలా తక్కువ అందులో నానికి ఇవ్వాలంటే ప్రొడ్యూసర్స్‌కి ఏమి మిగులుతుంది అని అనుకుంటున్నారు.



By January 02, 2019 at 05:29AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44117/jersey-movie.html

No comments