త్రివిక్రమ్, బన్నీ.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?!
ఒక సినిమా బాగా రావాలంటే ఏ ఒక్కరి ప్రతిభో సరిపోదు. సినిమా అనేది వందలాది మందితో కూడిన టీంవర్క్. ముఖ్యంగా హీరో, దర్శకుడు, సంగీత దర్శకులు కీలకపాత్రను పోషిస్తారు. ఇక సంగీత దర్శకులు అంటే హీరోలకి, డైరెక్టర్స్‌కి మద్య ఉండే అనుబంధం, అండర్‌స్టాండింగ్ వంటివి కూడా కీలకపాత్రను పోషిస్తాయి. ఇక విషయానికి వస్తే దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కి మద్య ఉన్న సాన్నిహిత్యం బాగా తెలిసిందే.
తన కెరీర్ మొదట్లో కొన్ని చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోటి, మణిశర్మ వంటి వారితో పనిచేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన మూవీ అంటే దేవిశ్రీప్రసాద్ ఖచ్చితంగా ఉంటాడనేంత గొప్పపేరు వచ్చింది. వీరి కాంబినేషన్‌లో ఏదైనా చిత్రం వస్తోందంటే అది ఖచ్చితంగా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అనే పేరు వచ్చింది. ఇలా వరుసగా త్రివిక్రమ్, దేవిశ్రీలు మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకు సాగుతూ వచ్చారు. దేవిశ్రీ అంటే త్రివిక్రమ్, దిల్‌రాజులకు ఆస్థాన సంగీత దర్శకుడు అనే పేరు వచ్చింది.
కానీ ఏమైందో ఏమో గానీ ‘అఆ’ చిత్రానికి మొదట త్రివిక్రమ్ అనిరుధ్‌ని తీసుకున్నాడు. నితిన్‌తో చిత్రం కాబట్టి ఏదో ప్రయోగం చేస్తున్నాడని అందరు భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మిక్కీజేమేయర్‌కి అవకాశం లభించింది. ఇక తాను అడిగిన సంగీతం అందించని వారికి త్రివిక్రమ్ మరోసారి చాన్స్ ఇవ్వడనే పేరుంది. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్.. పవన్‌కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’కి అనిరుధ్‌ని పెట్టుకున్నాడు. ఈ చిత్రం డిజాస్టర్ కావడం, పవన్, త్రివిక్రమ్‌ల తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అనిరుధ్ కావడం విశేషం.
ఆ తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తీసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీకి రాయలసీమ బ్యాగ్రౌండ్‌లో సాగే కథ కావడంతో తమన్‌కి చాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా తమన్ కూడా ఎన్టీఆర్‌ని, త్రివిక్రమ్‌ని మెప్పించాడు. ఆయన అద్భుతమైన ట్యూన్స్ అందించినప్పటికీ కొన్నింటిని త్రివిక్రమ్ సరిగా చిత్రీకరించలేకపోయాడు. ఇక విషయానికి వస్తే తాజాగా స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌తో, త్రివిక్రమ్ ఓ చిత్రం చేయనున్నాడు.
త్రివిక్రమ్-బన్నీ-దేవిశ్రీ అంటే వెంటనే మనకు ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి మ్యూజికల్ బోనాంజాలు గుర్తుకు వస్తాయి. మరి బన్నీ పట్టుదల మేరకు ఈ మూవీకి దేవిశ్రీనే మరలా త్రివిక్రమ్ పెట్టుకుంటాడా? లేక గతంలో బన్నీకి కూడా ‘రేసుగుర్రం, సరైనోడు’ వంటి హిట్స్ ఇచ్చిన తమన్ మరోసారి త్రివిక్రమ్ చిత్రానికి పనిచేస్తాడా? లేక మరోసారి మాటల మాంత్రికుడు అనిరుధ్ అనో, వేరే సంగీత దర్శకులనో లైన్‌లోకి తీసుకెళ్తాడా? అనేవి వేచిచూడాల్సివుంది.
By January 04, 2019 at 06:43AM
No comments