Breaking News

చిరుకి చెప్పా.. పవన్‌కి చెప్పలేను: నటి


తమిళంలో సరే.. వారి పరిస్థితులు, అభిమానం వేరు. అక్కడి ఓటర్లు, ప్రజల మైండ్‌ సెట్‌ కూడా డిఫరెంట్‌. కాబట్టే అక్కడ ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత వంటి సినిమా వారు ముఖ్యమంత్రులు కాగలిగారు. అలాగని అక్కడ కూడా పేరున్న అందరు రాజకీయాలలో రాణించారా? అంటే అదీ లేదు. కొంతలో కొంత చాలా కాలం తర్వాత విజయ్‌కాంత్‌ ఫర్వాలేదనిపించాడు. శివాజీ గణేషన్‌ నుంచి ఆయన కుమారుడు ప్రభు, కార్తీక్‌, శరత్‌కుమార్‌, గుళ్లు కట్టించుకుని పూజలందుకున్న ఖుష్బూ, రాధిక వంటి వారు కూడా రాణించలేకపోయారు. రజనీ, కమల్‌లు కూడా గెలుస్తారని ఎవ్వరూ ధీమాగా చెప్పలేకపోతున్నారు. 

ఇటీవలే విశాల్‌కి జ్ఞానోదయం అయింది. రాబోయేది స్టాలినే అని ప్రచారం సాగుతోంది. ఇక తెలుగునాట రాజకీయాలను శాసించిన మొదటి, చివరి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆరే అనే మాట కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్‌ సమయంలో కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం, ఎన్టీఆర్‌ని ప్రజలు దేవుడిలా కొలవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పాడు. అలాగని ప్రతిసారి ఎన్టీఆర్‌ని కూడా ప్రజలు గెలిపించలేదు. ఆ తర్వాత జమున, విజయనిర్మల, సాయికుమార్‌, నరేష్‌ నుంచి కోట, సత్యనారాయణ వంటి వారు చివరకు ఎన్టీఆర్‌ తర్వాత అంతటి క్రేజ్‌ ఉన్న కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి కూడా రాజకీయాలలో నిలదొక్కుకోలేకపోయాడు. 

దీనిపై తాజాగా సీనియర్‌ నటి, మాజీ ఎంపీ అయిన జమున స్పందించింది. ఆమె మాట్లాడుతూ, సినిమా వారు ఒకప్పుడు రాజకీయాలలోకి వెళ్లి మంచి చేసి గౌరవం కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వారు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. అది గౌరవ ప్రధంగా ఉంటుంది. నాడు నేను, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల కోరిక మేరకు రాజమండ్రి స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాను. అప్పుడు నాకు చాలా గౌరవం దక్కింది. నా నియోజకవర్గ అభివృద్దికి కూడా వారు సాయం చేశారు. కానీ ఇప్పుడు రాజకీయాలు రొచ్చుగా మారిపోయాయి. కోట్లు ఖర్చుపెట్టి గెలిచి, ఖర్చుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే కావాల్సిన డబ్బును కూడా ఇప్పుడే సంపాదించుకోవాలనే పరిస్థితి ఉంది. సినిమా వారు రాజకీయాలోకి వెళ్లినా అలానే చూస్తున్నారు. 

అందుకే నాడు చిరంజీవి పార్టీ పెడతాడని ప్రచారం జరుగుతున్న సమయంలో నేను ఆయనకు వద్దు అని చెప్పాను. కానీ ఆయన నవ్వుతూ మౌనంగా ఉండిపోయారు. నేను చెప్పినట్లే చిరంజీవి రాజకీయాలలో స్ధిరపడలేకపోయాడు. రాజకీయాల గురించి సినిమా వారు మర్చిపోవడం బెటర్‌. సినిమా వారిని ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారు. అదే వారు రాజకీయాలలోకి వెళ్లితే హీనంగా చూస్తారు. చిరంజీవితో పరిచయం ఉంది కాబట్టి రాజకీయాలలోకి వద్దని చెప్పగలిగాను. కానీ పవన్‌తో నాకు పరిచయం లేనందువల్ల ఆ మాట చెప్పలేకపోయాను అని తెలిపింది. ఎవరు ఏమనుకున్నా జమున చెప్పింది అక్షరసత్యమనే చెప్పాలి.



By January 01, 2019 at 01:54PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44109/jamuna.html

No comments