నిర్మాతను ఇబ్బంది పెడుతున్న మెహరీన్!
కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంతో పరిచయమైనప్పుడు అమ్మడిని చూసినవాళ్ళందరూ.. ఇండస్ట్రీకి అందమైన నటి దొరికిందనుకున్నారు. కానీ.. అమ్మడు మాత్రం నటిగా ప్రూవ్ చేసుకోవడానికంటే కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడం ఎక్కువగా ప్రయత్నించడంతో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతూ వస్తోంది. ఆఖరికి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అందాలు ఆరబోసినా కూడా ఫలితం దక్కలేకపోయింది. అసలే సినిమాలు సరిగా ఆడక, కథానాయికగా గుర్తింపు రాక ఇబ్బందిపడుతున్న తరుణంలో.. మెహరీన్ ను ఫిలిమ్ ఛాంబర్ కి ఈడ్చాడు ఓ యువ నిర్మాత.
విషయం ఏంటంటే.. రిజ్వాన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో సుధీర్ బాబు, మెహరీన్ లు హీరోహీరోయిన్లుగా ఓ సినిమా మొదలవ్వడం, ఆ ప్రొజెక్ట్ నుంచి సుధీర్ బాబు ఎగ్జిట్ అవ్వడంతో ఆఖరి నిమిషంలో హీరో ప్లేస్ ని మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ రీప్లేస్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయాలు నచ్చని మెహరీన్ ఆ ప్రొజెక్ట్ నుంచి వాకౌట్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పటివరకు ప్రొజెక్ట్ కోసం తీసుకున్న అడ్వాన్స్ మాత్రం తిరిగి ఇవ్వలేదంట. నిర్మాత అడిగితే.. ఈ ప్రొజెక్ట్ వల్ల నేను వేరే రెండు సినిమాలు పోగొట్టుకున్నాను. అందుకే అడ్వాన్స్ తిరిగి ఇవ్వను అంటూ మొండికేసిందట.
దాంతో ప్రొడ్యూసర్ ఫిలిమ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయంలో మెహరీన్ కు తన మ్యానేజర్ మరియు కొందరు హీరోల సపోర్ట్ తప్ప నిర్మాతల సపోర్ట్ ఏమాత్రం లేదు. మరి ఫిలిమ్ ఛాంబర్ తీర్పుకు తలొగ్గి అడ్వాన్స్ వెనక్కి ఇస్తుందో లేదో చూడాలి.
By December 16, 2018 at 12:25AM
No comments