Breaking News

రౌడీ కన్ను కాకినాడ అమ్మాయ్‌పై పడింది!


మన సినిమావారు ఏ ఊరుకి వెళితే ఆ ఊరి గురించి పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇక హీరోయిన్లతో పాటు హీరోలది అదే వరస. ఇప్పుడు ఆ జాబితాలోకి సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కూడా చేరాడు. ఈయన ముద్దు పేరు రౌడీ. ఈయనకు అతి కొద్ది చిత్రాలకే నైజాం మెగాస్టార్‌, నైజాం పవర్‌స్టార్‌ వంటి బిరుదులు వచ్చేశాయి. గతంలో ఈయన తెలంగాణలోని ఓ నగరానికి వెళ్లి అక్కడి అమ్మాయినే వివాహం చేసుకుంటానని మాటిచ్చి ఈ నగర ప్రజల మనసులను దోచుకున్నాడు. ఇప్పుడు సడన్‌గా మరో ఊరిపై కన్నేశాడు. 

ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో విజయ్‌ దేవరకొండ కూడా ఒకరు. ఈయనకు తెలంగాణలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు, పరభాషల్లో కూడా వీరాభిమానులైన లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉంది. రౌడీ వంటి మొగుడే కావాలని వారు కలలు కంటూ తమ కలల రాకుమారుడిగా ఆయనను ఊహించుకుంటున్నారు. 2018లో ‘గీతగోవిందం’తో 100కోట్ల క్లబ్‌లో చేరి, ‘నోటా’ని పక్కనపెట్టి ‘ట్యాక్సీవాలా’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన హీరో ఆఫ్‌ ది ఇయర్‌ విజయ్‌దేవరకొండ ప్రస్తుతం మైత్రిమూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ‘డియర్‌కామ్రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. 

ఈ సందర్భంగా ఆయన తనకి కాబోయే భార్య కాకినాడ అమ్మాయి అయి ఉండాలని చెప్పాడు. బ్యాగ్రౌండ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా నన్ను ఇష్టపడే అమ్మాయి ఉంటే చాలు.. పెళ్లాడేస్తాను. కొసమెరుపు ఏమిటంటే ‘గీతగోవిందం’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కాకినాడ కుర్రాడిగా నటించిన విషయం తెలిసిందే. 



By December 30, 2018 at 11:29AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44083/vijay-deverakonda.html

No comments