Breaking News

వ‌చ్చే ఏడాది చూపిస్తుంద‌ట‌!


అన్నీ వున్నా అల్లుని నోట్లో శ‌ని వున్న‌ట్టు క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌ల‌కు ఏమాత్రం తీసిపోని అందం రాయ్ ల‌క్ష్మీ సొంతం. క్రేజీ క‌థానాయిక‌కు కావాల్సిన క్వాలిటీస్ అన్నీవున్నా ఆ స్థాయిలో మాత్రం రాణించ‌లేక‌పోయింది. త‌న వ‌ద్ద వున్న మేనేజ‌ర్స్ వైఫ‌ల్యం ఓ కార‌ణంగా కాగా ఆ స్థాయిలో త‌ను ఆలోచించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని రాయ్ ల‌క్ష్మి ఓ సంద‌ర్భంలో ఒప్పుకుంది కూడా. `జూలీ-2`తో బాలీవుడ్‌లో వెలిగిపోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం కూడా బెడిసికొట్డడంతో తిరిగి త‌న అదృష్టాన్ని తెలుగు, త‌మిళ భాషల్లో ప‌రీక్షించుకుంటోంది.

తెలుగులో రాయ్ ల‌క్ష్మీ న‌టిస్తున్న‌తాజా చిత్రం `వేర్ ఈజ్ ద వెంక‌ట ల‌క్ష్మి`. కొత్త ద‌ర్శ‌కుడు కిషోర్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్‌, ప్ర‌వీణ్, మ‌ధునంద‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో మ‌ళ్లీ పుంజుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో వుంది రాయ్ ల‌క్ష్మి. ఇదిలా వుండ‌గా నిత్యం బీచ్‌ల‌లో ద‌ర్శ‌నమిస్తూ ఆ ఫోటోల‌ని ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంటూ ర‌చ్చ‌చేసే రాయ్ ల‌క్ష్మి ఈ ఏడాది చివ‌రి రోజైన సోమ‌వారం కూడా అభిమానుల హృద‌యాల్లో మంట‌పెట్టే పిక్‌ని ట్విట్టర్‌లో వ‌దిలింది. బ్లూ క‌ల‌ర్ బికినీని ధ‌రించిన‌ త‌న ఫొటోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. హాఫ్ ఫొటోని మాత్ర‌మే పోస్ట్ చేసిన రాయ్ ల‌క్ష్మి దానికింద క్యాప్ష‌న్‌గా ఆస్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది.

`ఈ ఏడాదిలో ఇదే నా చివ‌రి ట్వీట్. హాఫ్ ఫొటోతో ఈ ఏడాదికి ఎండింగ్ ప‌లుకుతున్న నేను నా ఫుల్ బాడీకి సంబంధించిన ఫొటోను వ‌చ్చే ఏడాది మీతో పంచుకుంటాను` అంటూ చ‌మ‌త్క‌రించ‌డం ప‌లువురు నెటిజ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ట్విట్ట‌ర్‌లో రాయ్ ల‌క్ష్మీ అభిమానుల‌తో పంచుకున్న ఈ ఫొటోకు 193 రీట్వీట్‌లు...3324 లైకులు కొట్టిన అభిమానులు రాయ్ ల‌క్ష్మిపై ఓరేంజ్‌లో అభిమానాన్ని కురిపించారు.



By January 01, 2019 at 01:00PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44108/rai-lakshmi.html

No comments