తోలు కంట పడితే, కెమెరా దూర్చేయడమేనా!
శృంగారానికి, విశృంఖలత్వానికి సన్నటి గీతే సరిహద్దు. కానీ రాం గోపాల్ వర్మ గారి కొత్త చిత్రం భైరవ గీతకి ఈ గీతలేవీ అగుపడ్డట్టు లేవు. చిత్రం ప్రొడక్షన్ ఆరంభం నుండి దీన్నొ బూతు కిందే ప్రామిస్ చేస్తూ వచ్చి చివారాఖరికి తన మాట నిలుపుకున్నారు సదరు నిర్మాతలు,
నిజానికి రామ్ గోపాల్ వర్మ చేతిలో కళాఖండాలు ఏవీ ఆశించలేదు గనక ఎవరికీ ఎటువంటి డిస్ అపాయింట్మెంట్ లేదు. వచ్చిన తల నొప్పల్లా దర్శకుడు సిద్దార్థ్ గారికి వర్మ గారు ఇచ్చిన ట్రైనింగ్. ఇప్పటికే వర్మ గారి చేతివాటం తెలిసిన వాళ్ళు ఆయన కెమెరా ఎక్కడెక్కడ దూర్చేస్తాడా అని సినిమాకి వెళ్లే ముందే ఆలోచిస్తుంటారు. కానీ మొన్నటి భైరవ గీత అందరి అంచనాలను దాటేసింది. హీరోయిన్ ఐరా మోర్ టూ మచ్ సహకరించిందేమో కానీ అక్కడ ఇక్కడా అని లేకుండా తోచిన చోటల్లా కెమెరా బిగించేసి, దొరికిన ప్రతీ షాట్లో అమ్మడి అందాలు పిండేశారు.
ఐస్ క్రీమ్ సిరీస్ మొదలు వర్మ తన ప్రతాపాన్ని ఎదో రకంగా నటీమణుల అందాల మీద కెమెరాతో జనాలపై సంధిస్తూనే ఉన్నారు. భైరవ గీత సైతం ఆయనలోని పైశాచిక దాడికి మరో ఉదాహరణగా నిలిచింది. సినిమా చూసినోళ్లు మాత్రం, పేరుకే సిద్ధార్థ్ దర్శకుడు గానీ వర్మ గారే ఈ షాట్లు అన్నీ అమర్చి ఉంటారని చెప్పుకోవడం కొసమెరుపు. ఇలాగైనా వర్మ గారి ఫాలోవర్స్ ఊరట పొందుతున్నారు. భైరవ గీతతో ఈ దాడి ఆగుతుందో లేక అశ్లీలతలో కూడా వర్మ మరిన్ని ముందడుగులు వేస్తాడో లేదో చూడాలి.
By December 18, 2018 at 11:43AM
No comments