కాజల్..చోటా..తెరవెనుక కొత్త కథ?
దేశ వ్యాప్తంగా మీటూ ప్రకంపనలు సృష్టిస్తుంటే అమ్మాయిలతో మాట్లాడటానికే సెలబ్రిటీలు భయపెడుతున్నవేళ టాలీవుడ్‌లో కొన్ని రోజుల క్రితం చోటా కె.నాయుడు చేసిన రచ్చ చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ `కవచం`. ఇందులో కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతుండగా కెమెరామెన్ చోటా కె. నాయుడు ఆమెను బలవంతంగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవడం టాలీవుడ్‌లో కలకలాన్ని సృష్టించింది. చోటాని ఇండస్ట్రీ నుంచి నుంచి శాశ్వతంగా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగే నడిచింది. దీంతో దిద్దుబాటకు ఉపక్రమించిన చోటా ఆ తరువాత కాజల్ చేత ప్రకటన చేయించాడు.
చోటా తనకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లాంటివాడని, అతనికి నాపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదని కాజల్ చెప్పడంతో చోటా వివాదం సద్దుమణిగింది. అయితే కాజల్ ఇలా చెప్పడం వెనుక పెద్ద కథే జరిగిందని, దీని వెనుక కొంత మంది పెద్దలు చక్రం తిప్పారని అందువల్లే కాజల్ లోలోపల రగిలిపోయినా బయటికి మాత్రం కూల్‌గా కనిపించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగిన తరువాత చోటా తీరు పట్ల కాజల్ ఆగ్రహాన్నివ్యక్తం చేసిందని, తనపై దురుసుగా ప్రవర్తించిన చోటాపై మీటూ తరహా కాంమెంట్‌లు చేయాలన్ననిర్ణయానికి వచ్చిందట. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన కొంత మంది సినీ పెద్దలు చోటాను అప్రమత్తం చేయడం వల్లే కాజల్‌తో కాళ్లబేరానికి వచ్చాడట. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ వివాదంపై స్పందించిన కాజల్ చోటా క్షమాపణలు చెప్పడం వల్లే వెనక్కు తగ్గానని చెప్పడం ఈ వార్తలకు బలాన్నిచేకూరుస్తోంది.
By December 18, 2018 at 06:34AM
No comments