Breaking News

‘మాయం’కు పూరి సపోర్ట్


పూరి జగన్నాథ్  ఆవిష్క‌రించిన ‘మాయం’ ట్రైలర్

అజ‌య్ క‌తువార్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా ‘మాయం’. ఇషితా షా క‌థానాయిక‌. జైయశ్రీ  రాచ‌కొండ‌, ల‌క్ష్మి హుసేన్‌, సందీప్ బోరెడ్డి తారాగ‌ణం. నిషాంత్ ద‌ర్శ‌కుడు. ధీమాహి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి.ఏ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ‘మాయం’ ట్రైలర్‌ని ఆవిష్క‌రించి న‌వ‌త‌రం క‌థానాయ‌కుడు అజ‌య్ క‌తువార్‌ని ఆశీర్వ‌దించారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ.. ‘‘మెహ‌బూబా చిత్రంతో న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన అజ‌య్ హీరోగానూ పెద్ద స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్నాను. న‌వ‌త‌రంలో బోలెడంత ప్ర‌తిభ దాగి ఉంది. అజ‌య్ హీరోగా నిరూపించ‌ుకునేందుకు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. మాయం చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్యాష‌నేట్ గా తెర‌కెక్కిస్తున్నార‌నిపిస్తోంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 

హీరో అజ‌య్ క‌తువార్ మాట్లాడుతూ.. ‘‘పూరి స‌ర్ ప్రోత్సాహంతో మెహ‌బూబా చిత్రంలో న‌టించాను. తొలి ప్ర‌య‌త్న‌మే అంత పెద్ద ద‌ర్శ‌కుడి స‌పోర్టు ద‌క్క‌డం ఆనందంగా ఉంది. నేను హీరోగా న‌టిస్తున్న ‘మాయం’ టైటిల్‌ని ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు. ఇంత‌కుముందు హాలీవుడ్‌లోనూ న‌టించిన అనుభ‌వం ఉంది. మూడేళ్ల క్రిత‌మే నేను న‌టించిన ‘ది ఇండియ‌న్ పోస్ట్‌మేన్’ 8 దేశాల్లో వివిధ సినిమా పండ‌గ‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు పంపించాం. మూడు దేశాల్లో నామినేట్ అయ్యింది. అలాగే ‘స్పైసెస్ ఆఫ్ లిబ‌ర్టీ’ అనే చిత్రం అమెరికాలో థియేట్రిక‌ల్ రిలీజ్ అయ్యింది. ఆ త‌ర్వాత ‘మెహ‌బూబా’ చిత్రంలో న‌టించాను. ప్ర‌స్తుతం మాయం రిలీజ్‌కి రెడీ అవుతోంది. నేను న‌టించిన ‘ప్రేమ‌దేశం’ త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తోంది’’ అని తెలిపారు.  

డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘‘గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌గారి చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్  రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ మూవీ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. రిలీజ్‌కి రెడీగా ఉంది..’’ అన్నారు. 



By December 31, 2018 at 03:44AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44087/maayam.html

No comments