Breaking News

అజయ్ పాసయ్యాడంట..


ఆగమన సన్నాహాల్లో ‘అజయ్ పాసయ్యాడు’

సుప్రసిద్ధ సినీ పాత్రికేయులు, రచయిత బి.కె.ఈశ్వర్ రచనతో రూపొందిన చిత్రం ‘అజయ్ పాసయ్యాడు’. భారతం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రేమ్ భగీరధ్ దర్శకత్వంలో మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ వినోదాత్మక, స్ఫూర్తి భరిత చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అజయ్ అమన్, సాయికిరణ్ హీరోలుగా అంబిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ, శివన్నారాయణ ముఖ్య పాత్రలు పోషించారు. 

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని నిర్మాతలు మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా దర్శకుడు ప్రేమ్ భగీరధ్ ‘అజయ్ పాసయ్యాడు’ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. నవ్విస్తూ, కవ్విస్తూనే ఆలోచింపజేసే ‘అజయ్ పాసయ్యాడు’ ఆద్యంతం అందరినీ అలరిస్తుంది. బి.కె.ఈశ్వర్ రచన, సాహిణి శ్రీనివాస్ సంగీతం, నటీనటుల అభినయం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. జనవరి 4న విడుదలవుతున్న ‘అజయ్ పాసయ్యాడు’ డిస్టింక్షన్‌లో పాస్ అవుతుందనే నమ్మకం మాకుంది..’’ అన్నారు.



By December 31, 2018 at 03:21AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44086/ajay-pasayyadu.html

No comments