Breaking News

RRRలో నటించే హీరోయిన్లను సెట్ చేశాడట!!


రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ కోసం అన్ని సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ బడా మల్టీస్టారర్ కి ముహుర్తాన్ని కూడా పెట్టేశారు. నవంబర్ 11 న 11 గంటలకు RRR మూవీ ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. అసలు ఈ సినిమా మొదలవ్వక ముందు నుండే ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. రాజమౌళి మీద క్రేజ్ దేశవ్యాప్తంగా బాహుబలితో ఆకాశాన్నంటింది. అందుకే రాజమౌళి ఈ మల్టీస్టారర్ పై అంత క్రేజ్. అందులోను తెలుగులో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ని ఒకే స్క్రీన్ మీద చూడడం అనేది అభిమానులకు పండగ లాంటిది. అందుకే ఆ సినిమా ఓపెనింగ్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి తన సినిమా మొదలు పెట్టేటప్పుడే.. ఆ సినిమాకి పని చేసే టెక్నీకల్ టీం దగ్గర నుండి నటీనటుల వరకు అందరిని ఎనౌన్స్ చేస్తాడు. మరి ఇప్పుడు ఈ మల్టీస్టారర్ కోసం రాజమౌళి నటీనటుల ఎంపిక పూర్తి చేసిన విషయం ఎక్కడా పొక్కలేదు.

అయితే స్టార్ హీరోలతో సినిమా ఓపెనింగ్ చేసేసి ముందుగా హీరోల మీదే ఫస్ట్ షెడ్యూల్ ని చిత్రీకరించి.. సెకండ్ షెడ్యూల్ కోసం హీరోయిన్స్ ని తీసుకొస్తాడని.. అందుకే రాజమౌళి తాపీగా ఉన్నాడనే టాక్ నడిచింది. అలాగే రాజమౌళి మల్టీస్టారర్ లో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారని.. అందులో ఒక హీరోయిన్ విదేశీ హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. మిగతా హీరోయిన్స్ ని సెకండ్ షెడ్యూల్ కి ఎంపిక చేసి ప్రకటిస్తారని అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేశాడని... 11 తేదీ 11 గంటలకు సినిమా ఓపెనింగ్ రోజునే హీరోయిన్స్ పేర్లని ప్రకటిస్తాడని అంటున్నారు. 

మరి రాజమౌళి ఎంపిక చేసిన ఆ హీరోయిన్స్ పై చిన్నపాటి క్లూ కూడా లేదు. అసలు రాజమౌళి మదిలో ఏ హీరోయిన్స్ ఉన్నారనే విషయం ఊహకి కూడా అందడం లేదు. మొదట్లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ వంటి పేర్లు బాగా వినబడినాయి. మరి ప్రస్తుతం ఆ హీరోయిన్స్ అయితే క్రేజ్ లో లేరు.... కాబట్టి రాజమౌళి సినిమాలో ఆ అద్భుత అవకాశం పట్టేసే హీరోయిన్స్ ఎవరై ఉంటారబ్బా.. అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.



By November 04, 2018 at 02:10PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43341/rajamouli.html

No comments