‘హవా’ ట్రైలర్ విడుదల చేసిన 9 మంది వీళ్లే!
తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జోనర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జోనర్‌లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్‌గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జోనర్ బేస్డ్ ఫిల్మ్ ‘హవా’. రీసెంట్‌గా రానా చేతుల మీదుగా విడుదల చేసిన మోషన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా ఈ మూవీ వార్తల్లో ఉండేలా చేస్తోంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్‌లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే కథ. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చేలా ఉందని ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ....
నందిని రెడ్డి- దర్శకురాలు
న్యూ టాలెంట్ అంతా కొత్త ఐడియాస్, కథలతో వస్తోంది. వీళ్ల వల్ల మేం కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి వస్తోంది. మధుర శ్రీధర్ గారు ఎప్పుడూ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. నాకు క్రైమ్ కామెడీస్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
బివిఎస్ రవి- రచయిత, దర్శకుడు
హాలీవుడ్ డైరెక్టర్ గై రుషీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ చూస్తుంటే నాకు ఆయన సినిమాలు గుర్తొస్తున్నాయి. సినిమాటోగ్రఫీ కానీ.. ఆర్టిస్టులు కానీ.. అద్భుతంగా వర్క్ చేసినట్టు అర్థమౌతోంది. రెండేళ్లుగా తెలుగులో జోనర్ లాయల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇది కూడా జోనర్ లాయల్ సినిమాలా కనిపిస్తోంది. అందుకే ట్రెండ్‌ను బట్టి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మధుర శ్రీధర్- నిర్మాత, దర్శకుడు
మహేష్ రాజు కలిశారు. సినిమా కోసం అడిగారు. నేను సినిమా చూశాను. చాలా బావుంది. యాక్షన్ పార్ట్‌తో పాటు మంచి కామెడీ ఉంది. ఆర్టిస్ట్ లంతా బాగా చేశారు. ఇలాంటి సినిమాకు హెల్ప్ చేస్తే.. ఇంకా మంచి సినిమా అవుతుందనుకున్నారు. ఆల్రెడీ హిందీలో మంచి రేట్‌కు శాటిలైట్ అమ్మేశారు. ఇది మంచి బిగినెంగ్ టు దిస్ మూవీ. నవంబర్ 23న విడుదల చేస్తున్నారు. పెద్ద సినిమాల మధ్య విడుదలవుతోంది. అయినా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. 2.0కు ముందు వస్తోంది. అయినా ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇలాంటి సందర్భాల్లో ఆకట్టుకుంటుందనే దానికి ఇది ఓ కేస్ స్టడీ లాంటి సినిమా అవుతుందనుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్.
వేణు ఊడుగుల- దర్శకుడు
సినిమా గురించి ఏం తెలియకుండానే వచ్చాను. బట్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై రెస్పెక్ట్ పెరిగింది. మంచి కమిట్మెంట్‌తో తీసిన సినిమా ఇది. హానెస్ట్‌గా డీల్ చేసిన క్రైమ్ డ్రామా అని అర్థమౌతోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. అందులోనే ఇది కూడా మంచి సినిమాగా నిలవాలని కూడా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాజ్ కందుకూరి - నిర్మాత
హవా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. మనసుపెట్టి కథ రాసుకుంటే చిన్న ఎటెంప్ట్ కూడా సక్సెస్ అవుతుంది. మంచి సోల్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. కానీ ఇందులో తొమ్మిది సోల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. టీమ్ మంచి ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా కూడా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ఇందులో మంచి కటెంట్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మధుర శ్రీధర్ ఓ సినిమాను మెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులంతా బాగున్నారు. దర్శకుడు మహేష్ వంటి వారి కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.
జానీ - డ్యాన్స్ మాస్టర్
ట్రైలర్ చూస్తే చాలా రిచ్‌గా ఉంది. డివోపీ వర్క్‌కు నేను అడ్మైర్ అయ్యాను. ప్రొడక్షన్ వేల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి కొత్తవాళ్లు తెస్తోన్న కొత్త కాన్సెప్ట్స్ నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ మూవీ వెనక నైన్ థాట్స్, నైన్ బ్రెయిన్స్ ఉన్నాయంటున్నారు.. సినిమా కూడా నైన్ వీక్స్ ఆడాలని కోరుకుంటున్నాను.
మహేష్ రెడ్డి - ‘హవా’ దర్శకుడు
వచ్చిన అతిథులందరికీ థ్యాంక్యూ. సినిమా గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పను. మీరు ట్రైలర్ చూశారు. 23న సినిమా విడుదల కాబోతోంది. అప్పుడే సినిమా ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. మమ్మల్ని మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో చైతన్య మదాడి, హీరోయిన్ దివి ప్రసన్నతో పాటు సంగీత దర్శకుడు గిఫ్టన్ ఎలియాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తమ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఈ నెల 23న విడుదల కాబోతోన్న ‘హవా’ చిత్రంలో చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటిస్తుండగా.. స్టీఫెన్ మర్ఫీ, ఫోబ్ జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, జో జోసెఫ్, అంజా మేయెర్, ఆల్వోన్ జూనియర్, విలియమ్ ట్రాన్, శ్రీజిత్ గంగాధరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోన్న ఈ చిత్రానికి ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: సంతోష్ షానమోని, సంగీతం: గిఫ్టన్ ఎలియాస్, పిఆర్వో: జి.ఎస్.కే మీడియా, నిర్మాణం: ఫిల్మ్ అండ్ రీల్, దర్శకత్వం: మహేష్ రెడ్డి.
By November 04, 2018 at 02:13PM
No comments