Breaking News

కులశేఖర్‌కి ఉన్న ఆ కోపం వల్లే..: ఆర్పీ పట్నాయక్


ఇటీవల పాటల రచయిత కులశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దేవాలయాలను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలు చేస్తున్న కులశేఖర్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని కొందరు చెబుతున్నారు. అయితే మతిస్థిమితం లేనివాడు.. ఖచ్చితంగా దేవాలయాలలోనే ఎందుకు దొంగతనం చేస్తాడు. అసలు మతిస్థిమితం లేని వాడు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు కులశేఖర్ విషయంలో వ్యక్తం చేసేవారు లేకపోలేదు.

ఇక విషయంలోకి వస్తే ప్రేమ పాటలకు పెట్టింది పేరుగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేరుంది. ఆయన గాత్రంలో వచ్చిన పాటలన్నీ చక్కని మెలోడీయస్‌గా ఉండటమే కాకుండా.. ఇప్పటికీ హంట్ చేస్తూనే ఉంటాయి. అలాంటి ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు సంగీతం మానేసి.. దర్శకత్వం వైపుగా అడుగులు వేస్తున్నాడు. అది వేరే విషయం. ఇక ఒకప్పుడు దర్శకుడు తేజ అంటే.. ఆ సినిమాకి సంగీత దర్శకుడు ఆర్పీనే అనేలా పేరుండేది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. అలాంటి తేజకి ఈ పాటల రచయిత అయిన కులశేఖర్‌ను పరిచయం చేసింది ఆర్పీనే. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు ఇప్పటికీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక అరెస్ట్ అయిన కులశేఖర్ గురించి తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు. ‘చిత్రం’ సినిమా సమయంలో తేజకి కులశేఖర్‌ను పరిచయం చేశానని, ఆయన ప్రతిభను గుర్తించిన తేజ వరుస అవకాశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే కులశేఖర్‌కి కోపం ఎక్కువని ఆర్పీ చెప్పడం విశేషం. అలాగే  ఆ కోపం కూడా వెంటనే తగ్గిపోయేది..కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేదని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు. ‘‘కులశేఖర్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి.. ఆయన విషయంలో నేను పెద్దగా మాట్లాడటం, రియాక్ట్ అవ్వడం వంటివి చేసేవాడిని కాదు. నాకు తెలిసి కులశేఖర్ కి అవకాశాలు తగ్గడానికి ఆయన కోపం కూడా ఒక కారణం. అవకాశాలు లేకపోతే.. మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నాడనేది మాత్రం నాకు కూడా తెలియదు.. ఏదో బలమైన కారణం మాత్రం ఉండే ఉంటుందని మాత్రం నా అభిప్రాయం..’’ అని కులశేఖర్ గురించి ఆర్పీ తెలిపారు. 



By November 11, 2018 at 10:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43448/rp-patnaik.html

No comments