Breaking News

ఈ సినిమా డైరెక్టర్ వర్మే.. నో డౌట్..!!


నేటితరంలో దర్శకుడు మారుతి కొన్ని చిత్రాలకు తానే దర్శకత్వం వహించినా కూడా పేరు మాత్రం ఇతరులది వేస్తాడు. ఎందుకంటే ఆ చిత్రం ఫ్లాప్‌ అయినా, మరీ హింసాత్మకం, అడల్ట్‌కంటెంట్‌ అయినా తనపైకి తప్పు రాకుండా చేసుకోవడానికి తన శిష్యుల పేర్లు వాడుకుంటూ ఉంటాడు. వాస్తవానికి ఇలాంటి సంప్రదాయానికి ఎప్పుడో తెరతీసిన దర్శకుడు వివాదాస్పద రాంగోపాల్‌వర్మ. ఇక శిష్యులు బాగా తీసిన చిత్రాలకు తన పేరు, తాను తీసే చెత్త చిత్రాలకు శిష్యుల పేర్లు వేసుకోవడంలో ఈయన దిట్ట. ఇక విషయానికి వస్తే ఈనెల 30వ తేదీన రాంగోపాల్‌వర్మ సమర్పణలో కన్నడ హీరో ధనుంజయ్‌ నటించగా, సిద్దార్ద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భైరవగీత’ చిత్రం విడుదల కానుంది. నిజానికి ఈ మూవీని తీసింది వర్మనే అని ప్రచారం సాగింది. తాజాగా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న ఇర్రా మాటలు దీనిని బలపరిచేలా ఉన్నాయని చెప్పాలి. 

ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వర్మ ఎంతో క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకి ఏమి కావాలో స్పష్టంగా చెబుతాడు. నేను నాటకరంగం నుంచి వచ్చాను. నాకు ఇదే మొదటి చిత్రం. వర్మ కొత్త వారి కోసం వెతుకుతున్నారని తెలిసి అప్రోచ్‌ అయ్యాను. దాంతో ఆయనకు నేను నచ్చి ఈ చిత్రంలో తీసుకున్నారు. వర్మ ఏం కావాలో సింపుల్‌గా చెప్పడం వల్ల ఇందులో నటించడం నాకు ఎంతో సులభమైంది. ఇది నా తొలి సినిమా అనే ఫీలింగ్‌ నాకు అసలు కలుగలేదు. ఇందులో నా పాత్ర పేరు గీత. విదేశాలలో చదువుకుని వచ్చి స్వేచ్ఛగా బతకాలని భావించే యువతి. ఇంటిలోనే జరిగిన అన్యాయం చూసి ఆమె ఏ నిర్ణయం తీసుకుంది? అనేది సస్పెన్స్‌. 

చాలా సన్నివేశాలలో నేను పరుగెత్తాల్సి వచ్చింది. స్వతహాగా క్రీడాకారిణిని కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇందులో ముద్దు సన్నివేశాలలో కూడా నటించాల్సి వచ్చింది. మా నాన్న లాయర్‌. మా అమ్మ ప్రొఫెసర్‌. చిత్ర పరిశ్రమలోకి వస్తానంటే మా అమ్మానాన్న ఎంతో ప్రోత్సహించారు. మీటూ ఉద్యమం వల్ల మహిళలకు మేలు జరిగి, వారు పనిచేసే చోట సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందనేది నా నమ్మకం. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి, మహానటి’ చిత్రాలు చూశాను. ఫలానా హీరోతో చేయాలని ఏమీ లేదు. మంచి కథలో భాగస్వామ్యం కావాలని ఉంది.. అని చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎక్కడ డైరెక్టర్‌ సిద్దార్ద్‌ పేరు చెప్పకపోవడం గమనార్హం. 



By November 27, 2018 at 06:54AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43672/irra-mor.html

No comments