Breaking News

పూరితో.. మరో ప్లాప్ హీరో..!!


పూరీజగన్నాథ్‌... తొలి చిత్రం ‘బద్రి’తోనే ఘనవిజయం సాధించాడు. ఆ తర్వాత ‘బాచి’ చిత్రం ఫ్లాప్‌ అయినా కూడా ‘పోకిరి, బిజినెస్‌మేన్‌, ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మానాన్నఓ తమిళ అమ్మాయి’ వంటి పలు బ్లాక్‌బస్టర్స్‌ తీశాడు. కానీ ఈయన రొటీన్‌ స్టైల్‌లోనే సినిమాలు చేస్తూ ఉండటంతో ఒకటి తర్వాత ఒకటిగా ఆయన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడుతున్నాయి. ఆమధ్యలో కాస్త వెరైటీగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ఏమైనా ఉంది అంటే అది ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ చిత్రమే. ఆ తర్వాత షరామామూలే. కళ్యాణ్‌రామ్‌తో తీసిన ‘ఇజం’, బాలకృష్ణ వంటి సీనియర్‌ స్టార్‌ అవకాశం ఇస్తే తీసిన ‘పైసావసూల్‌’, ఇక తన కుమారుడు ఆకాష్‌పూరితో తీసిన ‘మెహబూబా’ వంటి చిత్రాలు ఆయన గుడ్‌ విల్‌ని అథ:పాతాళానికి నెట్టేశాయి. 

మరోవైపు ఆయన వెంకటేష్‌, రామ్‌, నితిన్‌ వంటి హీరోలకు కథలు చెప్పినా వారు నో అన్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘దేవదాస్‌’తో మొదటి చిత్రంతోనే పెద్ద హిట్‌ కొట్టిన యంగ్‌ హీరో రామ్‌. ఈయనకు కూడా గతకొంతకాలంగా హిట్‌ లేదు. ఓ మంచి హిట్‌ కోసం మొహం వాచిపోయిచూస్తున్నాడు. ‘ఎందుకంటే ప్రేమంట.. ఒంగోలుగిత్త, మసాలా, పండగచేస్కో, శివం, హైపర్‌’ వంటి చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. మధ్యలో ‘నేను..శైలజా’ బాగా ఆడితే, ‘ఉన్నది ఒకటే జిందగీ, హలోగురు ప్రేమకోసమే’ చిత్రాలు కూడా సరైన సక్సెస్‌ని అందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ, రామ్‌లు కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఇద్దరీకీ ఈ చిత్రం కీలకం కానుంది. అందుకే ఈ మూవీని పూరీ సొంతబేనర్‌తో పాటు రామ్‌ సొంత బేనర్‌ అయిన స్రవంతి మూవీస్‌ భాగస్వామ్యంలో నిర్మితం కానుంది. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. డిసెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుందని, త్వరలోనే పూరీజగన్నాథ్‌, స్రవంతి రవికిషోర్‌లు కలిసి సంయుక్తంగా సినిమాని అనౌన్స్‌ చేస్తారని సమాచారం. 

మరి ఈ ఇద్దరు మైనస్‌లు కలిస్తే ప్లస్‌ అవుట్‌పుట్‌ వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...! ఇక దీని తర్వాత పూరీ తన తనయుడు ఆకాష్‌పూరీ హీరోగా మరో చిత్రంతో పాటు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రానికి కూడా దర్శకునిగా వ్యవహరిస్తాడనే వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో వాస్తవం ఎంతో చూడాలి...! 



By November 22, 2018 at 06:55AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43592/hero-ram.html

No comments