సవ్యసాచికి ఈ భామ ప్లస్సా.. మైనస్సా?!
బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి నాగ చైతన్య సినిమా సవ్యసాచితో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ అమ్మడు సవ్యసాచి సినిమా విడుదలకాకముందే... సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో మత్తెక్కించింది. అమ్మో ఈ భామ సవ్యసాచి సినిమాతో ఇక్కడే జెండా పాతేస్తుందని అన్నారు అంతా. నిజంగానే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసిన రచ్చ చూసిన ఎవ్వరైనా అలాగే అనుకుంటారు. క్లివేజ్ సోకులు, కుర్రకారుని మత్తెక్కించే చూపులు ఇలా నిధి అగర్వాల్ గ్లామర్ షో ఆమె కెరీర్ కి బాగా పనికొస్తుంది అనుకున్నారు. మరి తాజాగా విడుదలైన సవ్యసాచితో ఈ నిధి భవిష్యత్తు ఎలా వుండబోతుందో..?
నాగ చైతన్య కి లవర్ గా చిత్ర పాత్రలో నిధి గ్లామర్ షో అయితే బాగానే ఉంది. ఇక నిధి అగర్వాల్ లుక్స్ పరంగా జస్ట్ యావరేజ్ గా ఉంది. అందం విషయంలో కూడా సోసోనే అనే టాకోచ్చింది. నిధి అగర్వాల్ అందంగా ఉన్నప్పటికీ.. నటన పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. తన పాత్రలోనూ ఏ ప్రత్యేకతా కనబడదు. అసలు కొన్ని సీన్స్ లో హీరోయిన్ క్యారెక్టర్‌ని బలవంతంగా కథలోకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. నటన పరంగా ఆమె చాలా ఇంప్రూవ్ కావాల్సి వుంది. మరి మొదటి సినిమాలో చాలా యావరేజ్ నటనను కనబరిచిన నిధి అగర్వాల్ లో ఏం చూసి అఖిల్ తన సినిమాలో నిధిని హీరోయిన్ గా తీసుకున్నారో అన్నదమ్ములకే అర్ధమవ్వాలి. ఏది ఏమైనా నిధి సవ్యసాచి కి మైనస్సే గాని... ప్లస్ మాత్రం కాదు అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది.
By November 04, 2018 at 06:24AM
No comments