Breaking News

కీర్తిసురేష్‌పై ట్రోలింగ్.. ఎందుకంటే..?


నేను లోకల్ సినిమాలో డిగ్రీ పాస్ తర్వాత హీరో నానిని అందరూ నెక్స్ట్ ఏంటి అంటూ పాట పాడుతూ ఆటపట్టిస్తే... ఇప్పుడు కీర్తి సురేష్ ని చూస్తే అందిరికి మళ్ళీ అదేపాట గుర్తుకు వస్తుంది. సర్కార్ సినిమా తర్వాత కీర్తి సురేష్ డైరీ ఖాళీ. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అందుకున్నప్పటికీ... మహానటితో మళ్లీ ఎగిరింది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి జీవించిన కీర్తి సురేష్ కి మళ్ళీ హిట్ పడితే ఒట్టు. విక్రమ్ తో సామి 2 అట్టర్ ప్లాప్. విశాల్ పందెం కోడి అట్టట్ట ఆడింది. ఇక విజయ్ సర్కార్ కూడా ప్లాప్ కానీ... అనుకోకుండా విజయ్ సర్కార్ సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ ది కూరలో కరివేపాకు పాత్రే. 

అయినా సర్కార్ సినిమా 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన్నప్పటికీ... ఎక్కడ కీర్తి పేరు వినబడనే లేదు. కేవలం విజయ్ క్రేజ్, మురుగదాస్ పేరు తప్ప. ఇక వరస డిజాస్టర్స్ తో ఉన్న కీర్తి కి ఇటు తెలుగులో కానీ... అటు తమిళనాట గాని ఒక్క సినిమా చేతిలో ఉంటే ఒట్టు. అసలు ఈ ప్లాప్ హీరోయిన్‌ని చూస్ చేసుకోవడానికి తెలుగు హీరోలు కానీ తమిళ హీరోలు కానీ ఇష్టపడడం లేదట. ఏదో రాజమౌళి మైండ్ లో మహానటి కీర్తి సురేష్ ఉందనే టాక్ టాలీవుడ్ లో వినబడుతున్నప్పటికీ... కీర్తి సురేష్ కు ఆ ఛాన్స్ రావడం ఖాళీ అంటున్నారు. మరి ఎటువంటి ఆఫర్ చేతిలో లేని కీర్తి పరిస్థితి ఏమిటి చెప్మా...!

ఒకటి రెండు సినిమాల డిజాస్టర్స్ కే హీరోయిన్స్ దుకాణం సర్దుకునే పరిస్థితి. అలాంటిది కీర్తి సురేష్ కి మూడు వరస ప్లాప్స్. మరి ఇలాంటి టైం లో క్రేజ్ లేని భామకు ఎవరన్న అవకాశం ఇస్తారా... కానీ ఏ దర్శకనిర్మాత కూడా కీర్తి సురేష్ వైపు చూడడం లేదనే టాక్ అయితే బాగా నడుస్తుంది. మహానటి తర్వాత ఆఫర్స్ వెల్లువలా వచ్చాయనే టాక్ నడిచినా.. కీర్తి ‘సర్కార్’ తర్వాత ఫుల్ గా ఖాళీ అయ్యింది. అందుకే అందరూ ఎమ్మా కీర్తి నెక్స్ట్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



By November 16, 2018 at 04:25AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43509/keerthi-suresh.html

No comments