Breaking News

టాక్సీవాలా అస్సలు తగ్గడం లేదు!


గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోలకు కూడా సాధ్యమవని 100 కోట్ల క్లబ్బులోకి ఈజీగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ నోటా సినిమా ప్లాప్ పడేసరికి.. అందరికి విజయ్ క్రేజ్ అమాంతం పడిపోయిందని... ఇక విజయ్ కొత్త సినిమాల మార్కెట్ ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తం చేశారు చాలామంది సినీజనాలు. ఇక విజయ్ తాజా చిత్రం టాక్సీవాలా విడుదలవడమే కానీ.. ఆ సినిమా హిట్ అవదని విజయ్ క్రేజ్ ఎందుకు పనిచేయదని అన్నారు. సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా విజయ్ గట్టి ప్రమోషన్స్ తో బరిలోకి దిగాడు. మరి విజయ్ కూడా నమ్మలేనట్టుగా టాక్సీవాలా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

గత కొన్ని రోజులుగా సరైన సినిమా లేక ఉసూరుమంటున్న ప్రేక్షకులను టాక్సీవాలా మంచి ఎంటర్‌టైన్ చేస్తుంది. టాక్సీవాలా హిట్ తో విజయ్ దేవరకొండ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఫస్ట్ వీకెండ్ లోనే దుమ్ముదులిపిన టాక్సీవాలా వీక్ డేస్ లోను దూసుకుపోతుంది. సోమవారం థియేటర్స్ లో టాక్సీవాలా డ్రాప్ అవుతుందని... అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. శని, ఆదివారాల్లో మాదిరి సోమవారం థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడలేదు కానీ.. ఆక్యుపెన్సీ మాత్రం చాలా బాగుంది. కానీ నైట్స్ షోస్ మాత్రం కళకళలాడుతున్నాయి.

ఇక బుధవారం కూడా సెలవు దినం కావడంతో టాక్సీవాలా కొచ్చిన పాజిటివ్ టాక్ తో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఎలాగూ రేపు శుక్రవారం చిన్న చిన్న సినిమాలను దాటుకుని... రజినీకాంత్ 2.ఓ వచ్చే వరకు టాక్సీవాలాకైతే ఎదురే లేదనేది తెలుస్తుంది. మరి విజయ్ రేంజ్ అండ్ క్రేజ్ టాక్సీవాలాతో మరింత పుంజుకుందని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.



By November 22, 2018 at 11:02AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43597/taxiwala.html

No comments