రాధ విషయంలో నాకందుకే అసూయ: అంబిక
హీరోయిన్ రాధ అంటే అందరికీ సుపరిచితమే. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి, రాధ కాంబినేషన్ అంటే ఊగిపోయేవాళ్లు. చిరంజీవే అని కాకుండా బాలకృష్ణ, రాధది కూడా మంచి కాంబినేషన్. అయితే రాధ సిస్టర్ అంబిక కూడా మంచి నటి. మంచి నటే కాదు. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ సినిమా అంటే ఖచ్చితంగా అంబికే హీరోయిన్ అనే వాళ్లు. కానీ కొన్ని సినిమాలకే ఆమె పరిమితమైంది. చంద్రబింబం వంటి ముఖంతో, తరంగాల వంటి మాటలతో ఆనాడు అందాల తారగా పేరు తెచ్చుకున్న అంబిక.. తాజాగా బుల్లితెరపై అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా వచ్చి.. తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత అలీ.. మీ కంటే వెనుక వచ్చిన రాధకు తెలుగులో మంచి పేరు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? అని అంబికను అడిగితే ఆమె ఆసక్తికరంగా నవ్వుకుంటూ సమాధానమిచ్చింది. నాకంటే బాగా పేరు రాలేదు అని చెబితే అది ఎవరూ నమ్మరు. ఎందుకంటే.. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావడం తనకు అస్సలు ఇష్టం లేదు. మొదటి నుంచి రాధకు టీచర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఎప్పుడూ అదే మాట చెబుతూ ఉండేది. తెలుగు సినిమాల్లో ముందు నటించడం మొదలు పెట్టాను. అయినా రాధకు చాలా మంచి పేరు, మంచి సినిమాలు వచ్చాయి.
చాలా సార్లు.. ‘తెలుగులో నేను ఎందుకు హిట్ అవ్వలేదు’ అని ఒక ఫీలింగ్ వచ్చింది కానీ, రాధ సంపాదించిన, అంబిక సంపాదించినా.. ఆ డబ్బు మా ఇంటికే కదా వచ్చేది! అందుకే మా మధ్య అటువంటి అసూయలు, అపార్ధాలు ఎప్పుడూ రాలేదు. రాధ విషయంలో నేను అసూయ పడింది కేవలం డ్యాన్స్ విషయంలోనే. తను చేసినట్లు నేను చేయలేను. ఇక మా బ్రదర్ ఒకతను కేఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అలాగే ఇంకో బ్రదర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పరదేశి’ అనే చిత్రంలో మెయిన్‌రోల్ చేశారు. వారు కూడా అంతగా నిలబడలేదు..అంటూ అంబిక తెలిపింది.
By November 18, 2018 at 09:39AM
No comments