స్టార్ హీరోని షూటింగ్‌లోంచి గెంటేశారు?

బాలీవుడ్ యంగ్‌స్టార్ రణవీర్‌సింగ్ తాజాగా 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఆయన ఓ షూటింగ్‌ని చూస్తుండగా, ఆ చిత్ర యూనిట్ ఆయనను షూటింగ్ చూడనివ్వకుండా గెంటివేశారట. ఎందుకు అక్కడి నుంచి తనని గెంటేశారో మాత్రం రణవీర్‌సింగ్ చెప్పలేదు. కానీ అది అక్షయ్‌కుమార్, రవీనాటాండన్ కలసి నటించిన ఓ చిత్రం షూటింగ్‌లో జరిగిందని మాత్రమే ఆయన తెలిపాడు. ఈ విషయంపై మీడియా రణవీర్‌సింగ్‌ని ఎందుకు గెంటేశారు అని రవీనాటాండన్‌ని అడగ్గా ఆమె అసలు నిజం చెప్పుకొచ్చింది.
ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో రణవీర్ చిన్నవాడే కాకుండా బాగా అల్లరివాడు. నేను, అక్షయ్ కలిసి నటిస్తుండగా, అందులోని ఓ వాన పాటను అప్పుడు చిత్రీకరిస్తున్నారు. దానిలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాంటివి చిన్నపిల్లలు చూస్తే వారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. అందుకే నేను ఆ చిత్ర నిర్మాతకు విషయం చెప్పి రణవీర్‌సింగ్‌ని షూటింగ్ స్పాట్ నుంచి బయటకు పంపివేయించాను అని తెలిపింది.
అంతేగానీ తనకు రణవీర్‌సింగ్‌పై ఎలాంటి కోపం కూడా లేదని ఆమె స్పష్టం చేసింది. అయినా తెరపై కోట్లాది పిల్లలు చూస్తే సీన్స్‌లో నటిస్తూ, దానిని లైవ్‌లో చూస్తే చెడిపోతారని చెప్పడం, మరోవైపు రవీనా చెప్పింది నిజమేనా? కాదా? అనే విషయంపై రణవీర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద మతలబు ఉందనే అనుమానం రాకమానదు.
By November 03, 2018 at 02:24PM
No comments