‘టాక్సీవాలా’కు పాజిటివ్ పాయింట్ ఇదే?
ఈ కాలంలో సెంటిమెంట్స్ ఎవరు నమ్మట్లేదు చెప్పండి. సెంటిమెంట్స్ నమ్మొద్దు అని సినిమా వాళ్ళే సినిమాల్లో చెప్పి బయట సెంటిమెంట్స్ ని తెగ ఫాలో అవుతుంటారు. ఇది అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నా.. మన టాలీవుడ్ లో కొంచం ఎక్కువే అని చెప్పాలి. వారు చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతుంటే వారిని ఐరన్ లెగ్ అనడం..హిట్ అయితే గోల్డెన్ లెగ్ అనడం మన ఇండస్ట్రీ వాళ్లకి కామన్ అయిపోయింది.
ఇలా హీరోయిన్స్ విషయంలో ఎక్కువ జరుగుతుంటాయి. తెలుగులో ‘ఎవడే సుబ్రహ్మణ్యం, కల్యాణ వైభోగమే, మహానటి’ వంటి చిత్రాల్లో నటించిన మాళవిక నాయర్ కు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి పేరు తెచ్చుకున్నవే. ఈనేపధ్యంలో ఆమె లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’లో ఒక గెస్ట్ రోల్‌లో నటించిందట.
సో.. ఆమె ఈ సినిమాలో ఉంది కాబట్టి ఈమె రూపంలో ‘టాక్సీవాలా’కు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. రెండు నెలల కిందట ఈసినిమా మొత్తం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పైరేటెడ్ వర్షన్ చూసిన కొంతమంది సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈనెల 16 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా.. మాళవిక నాయర్ రూపంలో మంచి శకునం ఈ సినిమాకి ఉందని అంతా భావిస్తున్నారు. మాళవిక కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.
By November 04, 2018 at 04:26AM
No comments