Breaking News

ఇది తలైవర్‌ సినిమా: రసూల్


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, కరణ్‌ జోహర్‌ సమర్పణలో సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్‌ డిజైన్‌ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్‌ 3న చెన్నైలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా రసూల్‌ పూకొట్టి మాట్లాడుతూ ‘‘శంకర్‌ నాకు ఫోన్‌ చేసి స్టోరీని నెరేట్‌ చేశారు. ఫ్లోర్‌ స్పేస్‌ సౌండ్‌ స్క్రీన్‌ నుంచి ఆడియన్స్‌ వరకు వెళ్లడాన్ని ఆయన వివరించారు. అదంతా విని నాకు వెన్నులో చలి మొదలైంది. ప్రపంచ సినిమాలో ఇలాంటిది చేయడం ఇదే తొలిసారి. రెండేళ్లు నేను, శంకర్‌ కలిసి పనిచేసి దీన్ని రియాలిటీకి తీసుకొచ్చాం. చాలా మంది మాకు సాయం చేశారు. సాఫ్ట్‌ వేర్‌ డెవలప్పర్స్‌ సాయం మర్చిపోలేం. ఎందరో మమ్మల్ని అలోగరిథమ్‌ ఆఫ్‌ సినిమా ప్రొజెక్షన్‌ని రీరైట్‌ చేయడానికి అనుమతించారు. 

సృజనకారుల ఆలోచనలను అంతే గొప్పగా అర్థం చేసుకునే నిర్మాత చాలా ముఖ్యం. నిర్మాతకు ధన్యవాదాలు. ఇండియన్‌ సినిమా స్టాల్వార్ట్స్‌ ఎందరో ఇక్కడున్నారు. ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. కొత్త ఫార్మాట్‌కి సాక్షులు. త్రీడీ సౌండ్‌లో ఉన్న అన్నిటికన్నా అడ్వాన్స్డ్‌ లెవల్‌ ఇది. అలోగరిథమ్స్‌ మార్చి దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాం. ఈ ఫార్మాట్‌ వల్ల మూవీ మరింతగా ఆడియన్స్‌ మైండ్‌కి చేరుతుంది. ఇంత గొప్ప అచీవ్‌మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా టీమ్‌కి, లైకా టెక్నికల్‌ టీమ్‌కి ధన్యవాదాలు. ఇది తలైవర్‌ సినిమా’’ అని అన్నారు. 



By November 05, 2018 at 10:14AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43353/rajinikanth.html

No comments