Breaking News

సన్నీలియోన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్..!!


ప్రతి ఒక్కరు తమ కెరీర్‌లో కొన్నిసార్లు అనుకోని పాత్రలను, ఇష్టం లేని పనులను కూడా చేయాల్సివస్తుంది. కేవలం విలన్‌ పాత్రలు చేసినంత మాత్రాన వారు నిజజీవితంలో కూడా విలన్లు అయిపోరు. తెరపై త్యాగాలు, ఫైట్స్‌ చేసే వారంతా రియల్‌లైఫ్‌లో కూడా హీరోలు అయిపోరు. కాబట్టి కళాకారులు కుల, మత, ప్రాంతాలు, భాషలకతీతంగా అన్ని తరహా పాత్రల్లోనే నటించాల్సివుంటుంది. తోటి కళాకారుడు కోట శ్రీనివాసరావు తన కెరీర్‌ ప్రారంభంలో స్వర్గీయ ఎన్టీఆర్‌పై తీసిన పలు వ్యంగ్యచిత్రాలలో నటిస్తే ఆయనను ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు చంపేస్తామని భయపెట్టారు. ఇలాంటి ఘటనల వల్ల కళాకారులు అన్ని రకాల పాత్రలు చేయలేక గీత గీసి కూర్చోవాల్సివుంటుంది. అప్పటివరకు వ్యాంప్‌ తరహా పాత్రలను చేసిన మంజుభార్గవి ‘శంకరాభరణం’లో ఉదాత్తమైన పాత్రను చేసింది. ‘యమలీల’ వంటి చిత్రంలో తల్లిగా నటించి మెప్పించింది. అంతెందుకు సినీ కెరీర్‌ ప్రారంభంలో నేడు పెద్ద పెద్ద స్టార్స్‌గా వెలుగొందుతున్న వారు కూడా కాస్త అసభ్యకరమైన, పెద్దల చిత్రాల కోవలోని కొన్నింటిలో నటించిన దాఖలాలు ఉన్నాయి. 

ఇక విషయానికి వస్తే పోర్న్‌స్టార్‌గా సన్నిలియోన్‌పై ఓ ముద్ర ఉంది. దాంతో ఆమెను కేవలం అలాంటి వల్గర్‌ పాత్రలకు, ఐటం సాంగ్స్‌కి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ఆమెకి ‘వీరమహాదేవి’ చిత్రంతో ఎంతో ఉదాత్తమైన వీరనారి పాత్రను పోషిస్తోంది. తమిళనాడులోని నెల్లూరుకి చెందిన శరవణన్‌ అనే న్యాయవాది మధురై బెంచ్‌లో ప్రజాహిత వ్యాజ్యం కింద ఓ పిటిషన్‌ వేశాడు. శృంగార తారగా పేరొందిన సన్నిలియోన్‌ ఎంతో మహోన్నతమైన వీరమదేవి పాత్రను పోషించకూడదని, ఉన్నతమైన ఆ పాత్రలో సన్ని నటించడం అంటే వీరమదేవిని అవమానించడమేనని కాబట్టి సినిమా షూటింగ్‌ని వెంటనే ఆపేయాలని ఆయన కోర్టుని కోరాడు. 

దాంతో మద్రాస్‌ హైకోర్టుకి చెందిన మధురై బెంచ్‌ దీనిని కొట్టివేసింది. దాని ద్వారా ‘వీరమహాదేవి’ చిత్రానికి ఆటంకాలు తొలగిపోయాయి. ఫలానా నటిని ఫలానా పాత్రలో చేయవద్దని ఆదేశించడం వీలు కాదని, పాత్రకి సరిపోతారని అనుకుంటే ఏ పాత్రను ఎవరైనా పోషించవచ్చని, కాబట్టి దీనిని విచారణకు తీసుకోలేమని తేల్చిచెప్పింది. దీంతో ‘వీరమహాదేవి’ చిత్రానికి ఆటంకాలు తొలగిపోయాయి. పోర్న్‌స్టార్‌ అయినా అనాధపిల్లలను దత్తత తీసుకుని తన గొప్పతనాన్ని చాటిన సన్నిని మంచి విషయాలలో మెచ్చుకోకుండా ఇలాంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేయడం సరికాదనే చెప్పాలి. 



By November 05, 2018 at 10:01AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43352/sunny-leone.html

No comments