Breaking News

ఈ ఛాన్స్ అంత ఈజీగా రాలేదు: కీర్తిసురేష్!


కీర్తిసురేష్‌.. ఈ మలయాళ కుట్టి అతి తక్కువ చిత్రాలతో, అతి పిన్న వయసులోనే సత్తా కలిగిన నటిగా నిరూపించుకుంది. గ్లామర్‌షో చేయకుండా కూడా స్టార్‌ హీరోయిన్‌గా ఎలా ఎదగవచ్చో ఈమె చాటి చెప్పింది. ఇక ఈమె కెరీర్‌లో ‘మహానటి’ ఓ కీలకమైన మలుపు. దాని తర్వాత ఆమె అంతగా ఎదురుచూస్తున్న చిత్రం మాత్రం మురుగదాస్‌-విజయ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ‘సర్కార్‌’ మాత్రమేనని చెప్పాలి. విజయ్‌తో ఇప్పటికే ‘భైరవ’ చిత్రంలో నటించిన ఈమె విజయ్‌తో రెండోసారి, మురుగదాస్‌తో తొలిసారి కలసి పనిచేస్తోంది. బలమైన కథ, కథనాలను తయారు చేసుకోవడం.. వాటిని అంతే అద్భుతంగా, పవర్‌ఫుల్‌గా తెరపై ఆవిష్కరించడంలో మురుగదాస్‌ స్పెషలిస్ట్‌. 

ఈ చిత్ర విడుదల సందర్భంగా కీర్తిసురేష్‌ మాట్లాడుతూ.. ‘‘మురుగదాస్‌ గారు కథ చెప్పినప్పుడే ఎంతో కొత్తగా అనిపించింది. అలాగే నా పాత్ర కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉందనే నమ్మకం వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేస్తున్న టీంపై నాకు బాగా గురి కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌ ఓ రేంజ్‌లో ప్రేక్షకులలోకి వెళ్తుందని భావించాను. ఈ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇది నా అదృష్టం అనుకున్నాను. ఈ సినిమా చూసిన వారికి నేను, ఇందులో నేను పోషించిన పాత్ర తమ ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు ‘పందెంకోడి2’తో వచ్చాను. పెద్దగా గ్యాప్‌ లేకుండా ‘సర్కార్‌’తో వారిని మరోసారి పలకరించడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.



By November 08, 2018 at 04:04AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43394/keerthi-suresh.html

No comments