Breaking News

భార్యాభర్తలుగా విడిపోయాం అంతే: అమీర్!


బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా, దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన అమీర్‌ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో లవర్‌బోయ్‌ ఇమేజ్‌ సాధించినా కూడా ఆ తర్వాత విభిన్న ప్రయోగాలు, పాత్రలతో కమల్‌హాసన్‌ స్థాయిని దాదాపు అందుకున్న నటుల్లో ఈయన ఒకరు. ఇక ఈ సినీ కెరీర్‌ విషయం, నటనలోనే కాదు.. నిజజీవితంలో కూడా ఎంతో ఫ్రాంక్‌గా, విశాలంగా ఉంటారు. ఇక ఇటీవల తన మాజీ భార్య రీనాదత్తా బర్త్‌డే వేడుకలకు కూడా తన రెండో భార్య పిల్లలతో వెళ్లి గడిపివచ్చాడు. 16ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడినప్పటికీ ఈయన ఇప్పటికీ రీనాదత్తాతో తన స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉండటం విశేషం. 

ఇటీవల కరణ్‌జోహార్‌ చాట్‌షోలో పాల్గొన్న ఆయన రీనాదత్తాతో తన పెళ్లి, విడాకుల విషయం వంటివాటిపై నోరు విప్పాడు. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ, రీనాకి విడాకులిచ్చినంత మాత్రాన ఆమెపై నాకు గౌరవం లేనట్లు కాదు. విడిపోయిన సమయంలో మా ఇద్దరితో పాటు ఇరు కుటుంబాల పెద్దలు ఎంతో బాధపడ్డారు. కానీ అభిప్రాయ బేధాలు వచ్చిన తర్వాత కలిసి ఉండటంలో అర్ధం లేదు. ఆమెపై నాకున్న ప్రేమ తగ్గిపోయింది. చాలా చిన్న వయసులోనే మా వివాహం జరిగింది. ఇలా తెలిసి తెలియని వయసులో వివాహం చేసుకోవడం కూడా దీనికి ఓ కారణమై ఉంటుంది. భార్యాభర్తలుగా విడిపోయామే గానీ స్నేహితులుగా ఎల్లప్పుడు కలిసే ఉంటాం... అని ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చాడు. 

2002లో రీనాదత్తాతో విడాకులు తీసుకున్న అమీర్‌ మూడేళ్ల అనంతరం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయిన కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఆజాద్‌రావ్‌ ఖాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కాగా అమీర్‌. అమితాబ్‌తో కలిసి నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ విడుదలకు సిద్దమైంది. 



By November 08, 2018 at 04:12AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43395/aamir-khan.html

No comments