బోయపాటి క్లాస్, చరణ్ మాస్.. టోటల్‌గా కొణిదెల!
రామ్ చరణ్ సినిమాకి బోయపాటి.. ‘వినయ విధేయ రామ’ అని టైటిల్ పెట్టడానికి ఒక కారణం ఉంది. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ని కూడా థియేటర్స్‌కు తీసుకురావాలని బోయపాటి ప్లాన్. బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకీ నాయక’ విషయంలో కూడా ఇదే చేశాడు బోయపాటి. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో అదే ప్లాన్ వేసి సక్సెస్ కొడదాం అని ట్రై చేస్తున్నాడు.
టైటిల్ ని ఎరగా వేసి ఫ్యామిలీస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేయాలన్నదే బోయపాటి ప్లాన్. అయితే ఈసారి ఆ పప్పులు ఏమీ ఉడికేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఈసినిమాను మాస్ సినిమాగానే ప్రమోట్ చేయాలి తప్ప క్లాస్ సినిమా అనే భ్రమ కల్పించరాదని బోయపాటికి చరణ్ గట్టిగా చెబుతున్నాడట. టీజర్.. ట్రైలర్ చూసే ప్రేక్షకులు ఈ సినిమా ఇలా ఉంటది, అలా ఉంటది అని అనుకుని వస్తారు కాబట్టి మన సినిమాలో మెయిన్ ప్లాట్ ఏదో ముందే చెప్పేస్తే బెటర్ అని చరణ్ ఆలోచనట. అందుకే చరణ్ ఫస్ట్ లుక్ కోసం పంచెకట్టుతో సాంప్రదాయబద్ధంగా ప్లాన్ చేసినా కానీ చివరకు కత్తి పట్టిన స్టిల్లే బయటకి వచ్చింది. దీనినిబట్టి ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చి నిరాశ పడరనేది చరణ్ వాదన.
తన గత సినిమా ‘రంగస్థలం’లో చరణ్ చేసేది వినికిడిలేమి పాత్ర అని సినిమా రిలీజ్ అయ్యే వరకు దాచి వుంచాలని తొలుత భావించినా అది సబబు కాదని ముందే దానిని రివీల్ చేసేసారు. సో దాంతో ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకుని రావాలో ముందుగానే డిసైడ్ అయి వస్తారు. కాబట్టి వినయ విధేయ రామ విషయంలో కూడా అలానే చేద్దాం అని చరణ్ ఆలోచనట. అందుకే టీజర్ లో కూడా ఇదొక మాస్ మూవీ అని చెప్పేశారు.
By November 11, 2018 at 04:14AM
No comments