సమంత, చైతూలపై ఏంటీ వార్తలు..?
గత రెండు రోజులుగా టాలీవుడ్ క్యూట్ కపుల్ అయిన సమంత - నాగ చైతన్య మీద బోలెడన్ని వార్తలు సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సమంత కెరీర్ పెళ్లి తర్వాత కూడా సాఫీగా సాగిపోతుంటే.... నాగ చైతన్య మాత్రం కెరీర్ లో తిప్పలు పడుతున్నాడు. అందుకే సమంత భర్త కెరీర్ గురించి బెంగ పెట్టుకుంది అంటూ ఆ వార్తల సారాంశం. మరి అక్కినేని కోడలుగా సమంత ఆ ఇంట్లో అడుగుపెట్టకముందే... సమంత టాప్ హీరోయిన్. ఇక నాగ చైతన్య మాత్రం అప్పటికి యావరేజ్ హీరోనే. మరి భర్త సినిమాలు వరసగా ప్లాప్ అవడంతో కాస్త బాధపడినప్పటికీ... మరి బెంగ పెట్టుకునేంత లేదంటున్నారు సమంత సన్నిహితులు.
వారి మధ్యన ప్రేమ పుట్టడానికి హిట్ ఫట్ అనే తారతమ్యాలు చూసుకోలేదు. అలాగే పెళ్లి విషయంలోనూ ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లాడిన జంట.. కెరీర్ ఇప్పుడు బావుండదు. తర్వాత బావుంటుంది అది వేరే విషయం. ఇక భర్త చైతు సినిమాలే కాదు... ఈ ఏడాది రంగస్థలం, మహానటి తో హిట్స్ కొట్టినా యు - టర్న్ తో మాత్రం చేదు అనుభవాన్ని సొంతం చేసుకుంది సమంత. యు టర్న్ సినిమా హిట్ అన్నప్పటికీ కలెక్షన్స్ రాలేదు. అలాగే తమిళంలోనూ సమంత క్రేజ్ పనిచెయ్యడం లేదు. అక్కడ ప్లాప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో చైతు గురించి ఫీల్ అవుతూ తన కెరీర్ పాడు చేసుకోదు. ఏ భర్త ఫెయిల్యూర్ లో ఉన్నా.. భార్య అలానే ఫీల్ అవుతుంది. కానీ ఇదో వింత అన్నట్టుగా చూస్తున్నారు జనాలు.
ఇక సమంత - నాగ చైతన్య మీద మరో రూమర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. సమంత ప్రెగ్నెంట్ అని... చైతు తండ్రి కాబోతున్నాడనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వినబడుతుంది. అదలా ఉంటే.. చైతు - సమంత కలిసి మజిలీ సినిమాని స్టార్ట్ చేశారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో కోన వెంకట్ నిర్మాణసారథ్యంలో సమంత, చైతు లు కలిసి సెట్స్ మీదున్నారు. ఇక చైతు తన మామ వెంకీ తో కలిసి వెంకీ మామా అనే మల్టీస్టారర్ కూడా స్టార్ట్ చేసాడు.
By November 11, 2018 at 04:06AM
No comments