Breaking News

శ్రీదేవి కూతురు నోట.. విజయ్ దేవరకొండ మాట!


మొన్నామధ్యన విజయ్ దేవరకొండ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తాజాగా రాజమౌళి కూడా బాహుబలి‌లో శ్రీదేవిని మిస్ అయ్యాము. ఈసారి ఆమె కూతురు జాన్వీని తన ఆర్‌ఆర్‌ఆర్ లో తీసుకునే ఆలోచన చేస్తున్నట్లుగా ఫిలింసర్కిల్స్ లో టాక్ వినబడింది. అయితే జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం సౌత్ వైపు చూసే ఆలోచన ఉన్నట్లుగా కనబడలేదు. బాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాకే ఆమె సౌత్ బాట పట్టాలనుకుంటుందని ఆమె సన్నిహితులు ద్వారా తెలిసింది. కానీ జాన్వీ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో వీర లెవల్లో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ఆమె ఒక షోలో చెప్పిన  సమాధానం బట్టి తెలుస్తుంది.

జాన్వీ కపూర్ తాజాగా అన్న కాని అన్న అర్జున్ కపూర్ తో కలిసి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకి హాజరైంది. అయితే ఆ షో లో కరణ్ జోహార్ జాన్విని కొన్ని ప్రశ్నలడుగుతూ మధ్యలో ఒకవేళ నువ్వో రోజు ఓ మేల్ యాక్ట‌ర్‌గా నిద్ర లేస్తే… ఎవరిలా మేల్కోవాలని అనుకుంటావు? ఎందుకు? అంటూ ప్రశ్నించగా... దానికి జాన్వీ కపూర్ ఏ మాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండలా నిద్రలేచి నాతో సినిమా చేస్తా... అంటూ చెప్పింది. మరి జాన్వీ సమాధానం చూస్తుంటే... విజయ్ దేవరకొండ పై జాన్వీ చూపు గట్టిగ పడిందనిపిస్తుంది. త్వరలోనే విజయ్ తో సినిమా అవకాశం వస్తే బావుండుననేలా ఉంది జాన్వీ సమాధానం చూస్తుంటే.

మరి బాలీవుడ్ లోను విజయ్ దేవరకొండ క్రేజ్ కి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాని షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి తోనే పలు భాషల ఇండస్ట్రీలను తనవైపు తిప్పేసుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి జాన్వీ కపూర్ కోరిక మేరకు విజయ్ దేవరకొండ - జాన్వీ కలిసి అతి త్వరలోనే కలిసి ఒక సినిమా చేస్తే ఆ క్రేజ్, ఆ అంచనాలు మాములుగా ఉండవనే చెప్పాలి.



By November 27, 2018 at 05:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43670/sridevi-daughter.html

No comments