Breaking News

చిరు, పవన్ సినిమాలకు బ్యానర్స్ కట్టేవాడంట


గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ వేడుకకు  'స‌ద‌ర‌న్ స్టార్‌' అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయ‌డం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు బై ఏ సర్టిఫికెట్ తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జెఆర్‌సిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా జ‌రుపుకున్న సంద‌ర్భంగా ....

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం మాట్లాడుతూ... ఇటీవ‌లే విజ‌య్‌ది, నాది గీత‌గోవిందం విడుద‌ల‌యింది. ఆయ‌న గురించి గ‌తంలోనే స్టేజ్ మీద చెప్పాను సంస్కార‌వంతుడు అని. నా కెరియ‌ర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్న టైంలో అర‌వింద్‌గారు, బ‌న్నీగారు న‌న్ను గుర్తించి అవ‌కాశం క‌ల్పించినందుకు ఈ టాక్సీవాలాకి సంబంధించిన యూనిట్ మొత్తం నాకు కావ‌ల్సిన‌వాళ్ళే. రాహుల్ నీ డెడికేష‌న్ నేను చూసేవాడ్ని నాకు మంచి జ‌రిగింది నీకు కూడా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. టాక్సీవాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అర‌వింద్‌ గారు మాలాంటి వాళ్ళ‌కి ఇలా అవ‌కాశాలు ఇవ్వాలి. విజ‌య్ హ‌వా ఇలానే సాగాలి. హీరోయిన్ ప్రియాంక ఆల్ ద బెస్ట్‌. ఈ సినిమాకి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్‌కి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ జేక్స్‌బేజాయ్ మాట్లాడుతూ... ముందుగా న‌న్ను ఆద‌రించినందుకు, మ‌న‌స్ఫూర్తిగా నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన‌, యు.వి.క్రియేష‌న్స్‌కి, గీతాఆర్ట్స్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు రాహుల్‌కి కూడా నా కృత‌జ్ఞ‌త‌లు. విజ‌య్ కూడా చాలా స‌పోర్ట్ చేశాడు. మీరంద‌రూ థియేట‌ర్స్‌కి వెళ్ళి సినిమాని చూడాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ... కొత్త టాలెంట్‌ని ఎంక‌రేజ్ చెయ్య‌డంలో మా బ‌న్నీబాబు ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ ఫంక్ష‌న్ చాలా హెల్దీగా సాగుతుంది. ఒక ప్రౌడ్ మూమెంట్ చెప్పాలి. నిన్న కేర‌ళ‌లో చూశాను. బ‌న్నీని మ‌నం ఎలాగైతే అభిమానిస్తున్నామో. వాళ్ళు కూడా అలాగే అభిమానిస్తున్నారు. ఆ విష‌యంలో చాలా హ్యాపీ. రాహుల్ చెప్పిన క‌థ‌ని విజ‌య్ న‌మ్మి మా ఎస్‌కెఎన్ అలాగే యువి క్రియేష‌న్స్‌, గీతాఆర్స్ట్ రెండు బ్యాన‌ర్స్ మీద‌ రావ‌డం సంతోషంగా ఉంది.  టాలెంట్ ఉన్న వ్య‌క్తులు అంద‌రూ క‌లిసి తీసిన చిత్ర‌మిది.  సినిమా అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి తీశారు. ఈ సినిమాని అంద‌రూ చూసి ఆద‌రించాలి. ఎస్‌కెఎన్‌, నేను క‌లిసి జ‌ర్నీని స్టార్ట్ చేశాం. ఎస్‌కెఎన్‌ మంచి ప్రొడ్యూస‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. రాహుల్‌కి కూడా మంచి పేరు రావాలి. విజ‌య్ కూడా చాలా నేచుర‌ల్‌గా యాక్టింగ్ చేశాడు. అంద‌రూ ఆద‌రించి ఈ టీమ్‌ని బ్లెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను అంద‌రికీ థ్యాంక్యూ అని అన్నారు.

చిత్ర హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ... ఇక్క‌డ‌కి విచ్చేసిన బ‌న్నీగారికి ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు.  నాకు మీ మీద క్ర‌ష్ ఉంది. నేను మీకు పెద్ద అభిమానిని. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ... ముందుగా నేను ఈ స్టేజ్ మీద ఇలా ప్రొడ్యూస‌ర్‌గా ఉండ‌డానికి కార‌ణం గాడ్ ఫాద‌ర్ అల్లు అర‌వింద్‌ సార్‌. మాది ఏలూరు ఒక మెగా అభిమానిగా చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి సినిమాల‌కు బ్యాన‌ర్లు క‌ట్టే నేను అభిమానులంటే బ్యాన‌ర్లో పేరు వేయించే వాళ్ళే త‌ప్పించి నాలో టాలెంట్‌ని గుర్తించి ప్రొడ్యూస‌ర్‌గా చేయ‌డం ప్ర‌పంచంలోనే మొట్ట మొద‌టిసారి జ‌రిగింది. నేను మ‌న‌స్ఫూర్తిగా అల్లు అర‌వింద్‌గారికి సెల్యూట్ చేస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం దొర‌క‌డం చాలా క‌ష్టం. వంశీ నన్ను ఎంక‌రేజ్ చేశారు. మారుతి ఎంతో బిజీగా ఉన్నా త‌ను ఒక మంచి క‌థ రాహుల్‌కి ఒక పాయింట్ చెప్పి నాకు ఇచ్చారు. సూప‌ర్ న్యాచుర‌ల్ హై ఫై థ్రిల్ల‌ర్‌. ఇంత‌కు ముందు ఎప్పుడూ రాని పాయింట్ ఎవ‌రూ తీయ‌లేదు. ఇండ‌స్ర్టీలో ఎవ‌రికీ ఊరిక‌నే సూప‌ర్ స్టార్ రాదు. వ‌రుస‌గా మూడు హ్యాట్రిక్లు కొట్టిన హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌. ఇండ‌స్ర్టీని షేక్ చేసిన హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌. ఆయ‌న మ‌మ్మ‌ల్ని న‌మ్మిన న‌మ్మ‌కం. ఈ సినిమా లీక్ అయినా మేం వీక్ కాలేదు. సో మేమేమి భ‌య‌ప‌డ‌టం లేదు. న‌వంబ‌ర్ 17న మీ అంద‌ర్నీ అల‌రిస్తుంది.  ఇక నా స్టార్ స్టైలిష్ స్టార్ గురించి చెప్పాలి. నా కెరియ‌ర్ ఎఎతో స్టార్ట్ అయింది. నాకు ఏద‌న్నా జాబ్ ఇప్పించ‌మ‌న్నా నువు పిఆర్ ఓ చెయ్య‌మ‌న్నారు బ‌న్నీగారు నాకు చాలా హెల్ప్ చేశాడు. త‌న‌తో పాటు త‌నవాళ్ళు కూడా ఎద‌గాల‌ని కోరుకుంటారు. త‌ను ఒక లీడ‌ర్‌. ఎంతో మందికి చాలా చాలా ర‌కాలుగా హెల్ప్ చేస్తారు. 2009 క‌ళ్యాణ‌బాబు ఇంటికి వెళ్ళాను. టివి9లో మానేశావంట‌గా అన్నారు. అవును అన్నా వెంట‌నే ఒక క‌వ‌ర్ తెచ్చి ఇచ్చి ఉంచుకో అన్నారు. ఏద‌న్నా ఇబ్బంది క‌లిగితే చెప్పు అని వెళ్ళారు. ఇంత మంచి వ్య‌క్తులు కాబ‌ట్టే అంత మంచి స్టేజ్‌లో ఉన్నారు. 

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... శ్రీ‌ను ఇంత బాగా మాట్లాడేశాక ఇంక ఏం మాట్లాడాలో తెలియ‌డం లేదు. అత‌ను ఎన్ని నెల‌లు ప్రిపేర్ అయ్యాడో తెలియ‌దు. శ్రీ‌ను మాట్లాడి త‌న బ‌యోపిక్‌ని చూపించాడు మ‌నంద‌రికీ. విజ‌య్ చాలా వెరైట్ స‌బ్జెక్ట్స్ తీసుకుంటాడు. స్టోరీ డిఫ‌రెంట్‌గా ఉంటేనే చేయ‌డానికి ఒప్పుకుంటాడు. రాహుల్ కంగ్రాట్స్ టు యు. ఆల్ ద బెస్ట్‌. హీరో్యిన్ కి కూడా ఆల్ ద బెస్ట్‌.  మా బ్యాన‌ర్‌లో చాలా హిట్స్ వ‌చ్చాయి. గీత‌గోవిందం ఒక నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకు వెళ్ళింది థ్యాంక్యూ ఫ‌ర్ ద‌ట్ విజ‌య్‌. టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. By November 13, 2018 at 04:55AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43464/vijay-deverakonda.html

No comments