బన్నీ, విజయ్ ఒకే వేదికపై.. ఎట్టా ఉంటాది!!
టాలీవుడ్ హీరోస్ లో కొత్తగా స్టయిల్స్ ని పరిచయం చేసే హీరో మాత్రం అల్లు అర్జున్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ని అందుకే స్టైలిష్ స్టార్ అని సంబోధిస్తారు ఫ్యాన్స్. ఏ పార్టీకి వెళ్లాలన్న.. ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లాలన్నా అల్లు అర్జున్ స్పెషల్ గా డిజైన్ చేసిన న్యూ డ్రెస్ తో వెళ్తాడు. అందరి చూపు తన మీదే ఉండేలా చూసుకుంటాడు కూడా. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ లైతే మాములుగా ఫార్మర్స్ లోనే ఏ ఈవెంట్ కైనా హాజరవుతారు. కానీ అల్లు అర్జున్ స్టయిల్ వేరు. అందుకే ఎప్పుడూ న్యూ లుక్ తో ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ లతో అదరగొడతాడు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఐకాన్ కి మరి హీరో పోటికొస్తున్నాడు. డ్రెస్సులతో డిఫరెంట్ స్టయిల్స్ ని ఫాలో అవుతున్న ఆ హీరో అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు.
పెళ్లిచూపులు సినిమాలో నార్మల్ లుక్ తో ఉన్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి తో స్పెషల్ లుక్ కి మారడమే కాదు... స్పెషల్ డ్రెస్సెన్సు కూడా మెయింటింగ్ చేస్తున్నాడు. తానే ఒక డ్రెస్సింగ్ స్టయిల్ ని డిజైన్ చేస్తూ.. యూత్ కి ఫ్యాషన్ ఐకాన్ గా మారాడు. పంచె కట్టినా... లుంగీ వేసినా... స్పెషల్ డిజైనర్ డ్రెస్ వేసినా ఆ బట్టల్లో విజయ్ దేవరకొండ ఇచ్చే స్టయిల్ ఉంది చూసారు అబ్బబ్బ ఏముందిరా అనిపించేలా కుర్రకారు ఫాలో అవుతున్నారు. అందులోను విజయ్ దేవరకొండ రౌడీ అంటూ ఫ్యాషన్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు.
మరి అలాంటి డ్రెస్ సెన్స్ ఉన్న ఇద్దరు హీరోలు ఒకె వేదికపై కలిస్తే ఎట్టా ఉంటాది. నిన్న రాత్రి జరిగిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ తో పాటుగా అల్లు అర్జున్ కూడా ఒకే వేదికపై ఉన్నారు. మరి స్టైలిష్ స్టార్స్ ఇద్దరు ఒకే చోట కనబడేసరికి యూత్ కి ఎక్కడన్నా ఆగుతుందా. ఇక విజయ్ అయితే స్టైలిష్ న్యూ డిజైనర్ డ్రెస్ తో మెరిసిపోగా... అల్లు అర్జున్ మాత్రం ఈసారి రౌడీస్ లో చేసిన స్పెషల్ డ్రెస్ నాకు ఇవ్వమని అడిగి అందరిని ఆశ్చర్యంలో పడేశాడు. విజయ్ డ్రెస్స్ బావుంటాయని.. ఈ సారి ఒక డ్రెస్ ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పి.... విజయ్ ని ఈసారి తనకి డ్రెస్ డిజైన్ చేసివ్వమని అడిగాడు. మరి ఇద్దరు స్టైలిష్ స్టార్స్ కూడా ఇలా సరదాగా మాట్లాడుకోవడం మాత్రం అందరిని ఆకట్టుకుంది.
By November 13, 2018 at 04:32AM
No comments