Breaking News

వరుణ్ తేజ్ మంచి డెసిషన్ తీసుకున్నాడు..!


ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌తేజ్‌ వరుసగా విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. ‘ముకుంద, కంచె, ఫిదా, తొలిప్రేమ’ చిత్రాలతో తన సత్తా చాటాడు. వైవిధ్యభరితమైన ఏ కథ అయినా ఆయన ఓకే చేస్తున్నాడు. కేవలం మాస్‌ని మాత్రమే టార్గెట్‌ చేసుకున్న మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కంటే స్లోగా స్టడీగా వరుణ్‌తేజ్‌ కెరీర్‌ సాగుతోంది. కాగా ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలు చేస్తుండగా, రెండు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ‘అంతరిక్షం’ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానుంది. మరోవైపు ఆయన దిల్‌రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌లో సీనియర్‌ స్టార్‌ వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్‌2’ అనే మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ అనే ఉపశీర్షికతో పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న దీనికి అనిల్‌రావిపూడి దర్శకుడుకావడం విశేషం. ‘పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌’ వంటి ఆయన చిత్రాలన్నీ ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకునే సినీ వర్గాలను బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి. 

నేడు ప్రతి చిత్రంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ తర్వాత ఆ రేంజ్‌లో కాకపోయినా కామెడీని నమ్ముకున్న అనిల్‌రావిపూడి అంటే మినిమం గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. మొదట ఈ మూవీని సంక్రాంతి కానుకగా బరిలోకి దింపాలని దిల్‌రాజు భావించాడు. సంక్రాంతికి గత కొన్నేళ్లుగా పెద్ద పెద్ద చిత్రాలు వస్తూనే ఉన్నా వాటితో పాటు విడుదలయ్యే మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలు కూడా స్టార్స్‌ చిత్రాలతో పోటీ పడుతున్నాయి. అదే నమ్మకంతో దిల్‌రాజు దీనిని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే సంక్రాంతి బరిలోనే రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీనుల ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదల కానుంది. దీంతో రామ్‌చరణ్‌ చిత్రంతో పోటీ పడటం వరుణ్‌తేజ్‌కి ఇష్టం లేదని తెలుస్తోంది. మెగాభిమానులు బాగా ఆదరించాలంటే రెండు చిత్రాలకు గ్యాప్‌ ఉండటం ముఖ్యమని వరుణ్‌తేజ్‌ ఉద్దేశ్యం. ఇది మంచి ఆలోచనే. అందునా వరుణ్‌తేజ్‌ ‘అంతరిక్షం’ డిసెంబర్‌ 21న విడుదలైతే పెద్దగా గ్యాప్‌లేకుండానే రెండో చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగడం కూడా వరుణ్‌తేజ్‌కి ఇష్టం లేదట. 

దాంతో ఆయన ‘ఎఫ్‌2’ మూవీని జనవరి 25న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల చేయాలని దిల్‌రాజుని కోరుతున్నాడు. దాదాపు ఇదే సీజన్‌లో వచ్చిన ‘తొలిప్రేమ’ వరుణ్‌తేజ్‌కి మంచి ఫలితం ఇచ్చింది. మరి దిల్‌రాజు విషయానికి వస్తే ఆయన రిలీజ్‌ డేట్‌లు పలు ఆర్ధిక సంబంధాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి స్థితిలో దిల్‌రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి! ‘ఎఫ్‌2’ వాయిదా పడితే మాత్రం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ నటిస్తున్న ‘మిస్టర్‌ మజ్ను’ సంక్రాంతి బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. 



By November 26, 2018 at 07:06AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43657/varun-tej.html

No comments