Breaking News

‘శరభ’ చిత్రంపై బ్రాహ్మణుల అటాక్..!


‘శరభ’ చిత్రం బ్రాహ్మణులను కించపరిచేలా విధంగా ఉంది - “భాగ్యనగర అర్చక పురోహిత సంగం”

హిందూ సాంప్రదాయల ప్రకారం చేసే శుభకార్యాలలో బ్రాహ్మణులది చాలా ఉన్నతమైన పాత్ర. కానీ ‘శరభ’ సినిమాలో మాత్రం అలా లేదు అని బ్రాహ్మణులు ఆవేదన చెందుతున్నారు. సినిమాలు మొదలయ్యేటప్పుడు.. తమతో పూజ చేయించుకుని.. అంతా శుభం జరగాలని ఆశీర్వదాలు తీసుకుంటారని, కానీ సినిమాలలో తమ పాత్రలను ఎందుకు ఇంత కించ పరిచెట్టు తీస్తారు.. అని బ్రాహ్మణుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులపైన, హిందూ దేవాలయాలపైన.. హేళనగా కొన్ని సన్నివేశాలు వస్తున్నాయని.. ‘‘భాగ్యనగర అర్చక పురోహిత సంఘం’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల విడుదలైన ‘శరభ’ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ, మరియు బ్రాహ్మణులను చంపుతున్నట్టు తీసిన సన్నివేశాలు తమను చాలా బాధకలిగించాయని అన్నారు. ఇంకా ఈ సినిమాలో బ్రాహ్మణులకు దెయ్యం పట్టినట్టు, బ్రాహ్మణులని చంపుతున్నట్టు తీసిన తీరు తమను కించ పరిచే విధంగా ఉందని వారు ఆరోపించారు. 

భాగ్యనగర అర్చక పురోహిత సంఘం కమిటీ సభ్యులు అందరూ కలిసి తెలంగాణా ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ని కలిసి ఈ విధమైన సినిమాలని ప్రోత్సహించవద్దని సంఘం తరపున వినతి పత్రం సమర్పించారు. 

దీనిపై ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా కించ పరిచే వాటికి మేము ఎప్పుడు వ్యతిరేకమే. మళ్లీ ఇలాంటి సన్నివేశాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రతలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను..” అన్నారు.  

భాగ్యనగర అర్చక పురోహిత సంఘం తరుపున ప్రెసిడెంట్ గట్టు శ్రీనివాసాచార్యులు, వైస్ ప్రెసిడెంట్ కొట్టారు అనంతనాగశర్మ, జనరల్ సెక్రటరీ మల్లాది చంద్రమౌళి, ఆరుట్ల కరుణకరాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్న జీయర్ స్వామి ఈ చిత్రంని చూసినప్పుడు ఈవిధమైన సన్నివేశాలు లేవని, తరువాత కలపడం జరిగిందని వారు తెలిపారు.



By November 27, 2018 at 12:46PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43678/brahmins.html

No comments